Share News

Banks: రూ.లక్షకు మించి డ్రా చేస్తున్నారా.. ఎన్నికల సంఘం హెచ్చరిక తెలుసా

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:43 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న డబ్బును కట్టడి చేయడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాంకులకు ఈసీ కొన్ని సూచనలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి.

Banks: రూ.లక్షకు మించి డ్రా చేస్తున్నారా.. ఎన్నికల సంఘం హెచ్చరిక తెలుసా

ఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న డబ్బును కట్టడి చేయడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాంకులకు ఈసీ కొన్ని సూచనలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి. గత రెండు నెలల్లో అటువంటి డిపాజిట్లు లేదా ఉపసంహరణలు చేయని వారికి ఈ నియమం వర్తిస్తుంది.

ఇది కాకుండా ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డ్రా చేస్తే దాని సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి అందజేయాలి. అలాగే బ్యాంకులన్నీ అనుమానాస్పద లావాదేవీల గురించి జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి. ఈసీ నియమించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి ఈ సూచనలు చేశారు.


ఇందులో దాదాపు ప్రధాన బ్యాంకులకు చెందిన 51 మంది అధికారులు పాల్గొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థి తన పేరుతో లేదా ఏజెంట్‌తో కలిసి ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.

బ్యాంక్ లేదా పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదు తీసుకువెళ్లేందుకు క్యూఆర్ రసీదును ఈఎస్‌ఎంఎస్ పోర్టల్ నుంచి రూపొందించి నగదు రవాణా చేసే వాహనంతో పాటు వచ్చే అధికారులు, ఉద్యోగులకు అందజేయాలని సూచించింది. దీన్ని తనిఖీ సమయంలో చూపాలి. నగదు సమాచారం QR రసీదుతో సరిపోలకపోతే దాన్ని ఉల్లంఘనగా పరిగణిస్తారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 03:43 PM