Share News

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

ABN , Publish Date - Mar 30 , 2024 | 11:59 AM

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. మొత్తం ఐదుగురికి కేంద్రప్రభుత్వం భారత రత్నలు ప్రకటించగా.. బీజేపీ సీనియర్ నేత అద్వానీ అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆయన నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా అద్వానీని సన్మానించనున్నారు. నలుగురికి మరణాంతరం ఈ పురస్కారాలు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు.
GVL Narasimha Rao: పీవీ నరసింహారావు చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలి

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారత రత్న పురస్కారం అందుకున్నారు. పీవీ నరసింహరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసింది పీవీ హయాంలోనే. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. దేశాన్ని ఆర్థికంగా పురోగమింపజేయడానికి బలమైన పునాది వేయడంలో పీవీ కీలకపాత్ర పోషించారు. అలాగే చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన కుమారుడు జైన్ చౌదరి, మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ తరపున ఆమె కుమార్తె డాక్టర్ నిత్య పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే తదితరులు హాజరయ్యారు.

Aravind: పీవీను కాంగ్రెస్ అవమానపరిచింది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 12:37 PM