Bangalore: 7న నగరంలో సంక్రాంతి సంబరాలు
ABN , First Publish Date - 2024-01-05T13:06:37+05:30 IST
నగరానికి చెందిన ప్రముఖ తెలుగు సంఘం తెలుగు విజ్ఞాన సమితి ఈ నెల 7న సంక్రాంతి సంబరాలను జరుపనుంది. ఈ మేరకు సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మీరెడ్డి నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన ప్రముఖ తెలుగు సంఘం తెలుగు విజ్ఞాన సమితి ఈ నెల 7న సంక్రాంతి సంబరాలను జరుపనుంది. ఈ మేరకు సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మీరెడ్డి నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు. వయ్యాలికావల్‌లోని సమితి ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు గోపూజతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సమితి అధ్యక్షుడు డాక్టర్. ఎ.రాధాకృష్ణరాజు అధ్యక్షత వహించనుండగా ఉపాధ్యక్షులు కె.గంగరాజు, ఆర్. ఆదికేశవులు నాయుడు, కోశాధికారి సీఏ వరదరాజుతో పాటు ఇతర పదాదికారులు కార్యవర్గ సభ్యులు పాల్గొంటారని తెలిపారు