Share News

Ram Mandir: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెల రోజుల్లో

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:26 PM

అయోధ్యలో రామ్ లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజులపాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు శనివారం వెల్లడించారు.

Ram Mandir: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెల రోజుల్లో

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజులపాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు శనివారం వెల్లడించారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆలయానికి బంగారం, వెండి, చెక్కులు తదితర రూపాల్లో సమకూరిన ఆదాయం విలువెంతో తెలుసా.. అక్షరాలా రూ.25 కోట్లు. ట్రస్ట్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. వివిధ రూపంలో వచ్చిన రూ.25 కోట్ల విరాళాలు హుండీల్లో జమ అయినట్లు తెలిపారు.

అయితే ఆన్ లైన్ చెల్లింపుల గురించి తమకు తెలియదని అన్నారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మంది భక్తులు రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారని చెప్పారు. అయోధ్యలో సుమారు 50 లక్షల మంది భక్తులు హాజరయ్యే శ్రీ రామ నవమి పండుగ రోజుల్లో విరాళాలు మరింతగా పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. శ్రీ రామ నవమి సందర్భంగా సమకూరే నగదును లెక్కించేందుకు ఎస్బీఐ నాలుగు ఆటోమెటిక్ కౌంటింగ్ మెషీన్లను ఏర్పాటు చేసిందని గుప్తా వివరించారు.


రసీదులను జారీ చేయడానికి ట్రస్ట్ డజను కంప్యూటరైజ్డ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల పెట్టెలు ఉంచారు. త్వరలో రామాలయం ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో కూడిన కౌంటింగ్ గది నిర్మించనున్నారు.

రామ్‌లల్లాకు బహుమతిగా లభించిన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను కరిగించి, నిర్వహించే బాధ్యతను భారత ప్రభుత్వ మింట్‌కు అప్పగించింది. ఎస్బీఐ - ట్రస్ట్‌కి మధ్య ఎంవోయూ కుదిరింది. ఒప్పందం ప్రకారం విరాళాలు, సమర్పణలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, నగదు సేకరణ పూర్తి బాధ్యతను ఎస్‌బీఐ తీసుకుని బ్యాంకులో జమ చేస్తుంది. ఇందుకోసం ఎస్‌బీఐ సిబ్బందిని పెంచింది. నగదును ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో లెక్కిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 09:27 PM