Share News

Ram Mandir: అయోధ్య ఆలయం సమీపంలో 5 స్టార్ హోటల్.. నిర్మాణ ఖర్చు తెలిస్తే షాక్

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:07 PM

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) అనంతరం రామమందిర పరిసరాల్లో పర్యాటక రంగం ఊపందుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకుంటున్నారు.

Ram Mandir: అయోధ్య ఆలయం సమీపంలో 5 స్టార్ హోటల్.. నిర్మాణ ఖర్చు తెలిస్తే షాక్

అయోధ్య: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) అనంతరం రామమందిర పరిసరాల్లో పర్యాటక రంగం ఊపందుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్(EaseMyTrip) ఆసక్తికర ప్రకటన చేసింది. మందిర సమీపంలో 5 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ.. రామ్ లల్లా ఆలయానికి కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఈ హోటల్ ఉంటుందని తెలిపారు.

రానున్నరోజుల్లో అయోధ్య మహానగరంగా మారే అవకాశం ఉండటంతో అక్కడికి వచ్చే వారి కోసం 5 స్టార్ హోటల్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఈ హోటల్‌ అంచనా వ్యయం అక్షరాల రూ.100 కోట్లని వివరించారు. అయోధ్యకు వచ్చే పర్యాటకులకు మెరుగైన అనుభూతిని ఇవ్వడం తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగ్గా అప్పటి నుంచి వేల సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకున్నారు. భక్తుల విరాళాల ద్వారా ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2024 | 12:08 PM