Ayodhya Ram Mandir: నేషనల్ హాలిడేగా జనవరి 22? రాష్ట్రపతి, ప్రధానికి లేఖ..!
ABN , Publish Date - Jan 17 , 2024 | 06:09 PM
న్యూఢిల్లీ, జనవరి 17: ప్రతి భారతీయుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఆ రోజున దిశాబ్ధాల నాటి కల సాకారం కానుంది కాబట్టి. అయోధ్యలో రామమందిరానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది.
న్యూఢిల్లీ, జనవరి 17: ప్రతి భారతీయుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఆ రోజున దశాబ్దాల నాటి కల సాకారం కానుంది కాబట్టి. అయోధ్యలో రామమందిరానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. జనవరి 22 నుంచి అయోధ్య రామ మందిర ద్వారాలు ప్రపంచ భక్త జన దర్శనం కోసం నిరంతరం తెరుచుకుని ఉంటాయి. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సహా వివిధ పార్టీలకు చెందిన అగ్ర రాజకీయ నాయకులు, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వ్యాపార దిగ్గజాలు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని.. చాలా రాష్ట్రాల్లో జనవరి 22ని సెలవు దినంగా ప్రకటించాయి. అంతేకాదు.. ఈ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు. జనవరి 22వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ అనే ఓ న్యాయవాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
శ్రీరాముడు ప్రతి భారతీయుడి శ్వాసలో, నరనరాల్లో ఉన్నారని.. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ జనవరి 22ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని సదరు న్యాయవాది తన లేఖలో కోరారు. 'శ్రీరాముడు భారత జాతికి గర్వకారణం.. భారతీయ నాగరికతలో అంతర్భాగం. ప్రతి భారతీయుడి శ్వాసలో ఉన్నారు. శ్రీమహా విష్ణువు గానీ, ఇతర ఏ దేవుళ్ల కంటే కూడా శ్రీరాముడినే ఎక్కువగా పూజిస్తారనేది అందరికీ తెలిసిందే. దేశ ప్రజలు జనవరి 22ను జాతీయ పండుగగా జరుపుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే.. దేశ ప్రజలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ 22 జనవరి 2024ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి.' అని లేఖలో విజ్ఞప్తి చేశారు న్యాయవాది.
హాలిడే ప్రకటించిన రాష్ట్రాలివే..
జనవరి 22న నేషనల్ హాలిడే ప్రకటిస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు కానీ.. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే హాలిడే డిక్లేర్ చేశాయి. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ రోజున ఉత్తరప్రదేశ్, గోవా, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సెలవు దినంగా ప్రకటించారు. ఆ రోజున స్కూల్స్, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అలాగే, ఈ రాష్ట్రాలు డ్రై గా ప్రకటించాయి. మద్యం విక్రయాలు జరుపవొద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి.