Share News

Ayodhya Ram mandir: సోనియా, ఖర్గే నిర్ణయం ఆత్మహత్య సదృశమా?.. ఏం తేలిందంటే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:04 PM

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించడంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Ayodhya Ram mandir:  సోనియా, ఖర్గే నిర్ణయం ఆత్మహత్య సదృశమా?.. ఏం తేలిందంటే..

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Temple) ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ (Congress) నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించడంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం రామాలయం ఈవెంట్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తలపెట్టందంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ఎన్నికలకు ముందు ప్రారంభించడం వెనుక ఉద్దేశాలు ఏమిటని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ నిలదీశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుందనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆసక్తికరంగా, ఒక ప్రముఖ టీవీ ఛానెల్ దీనిపై అభిప్రాయ సేకరణ జరిగింది.


అభిప్రాయ సేకరణలో..

రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకారాదని సోనియాగాంధీ-ఖర్గే తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశం (Suicidal for congress) కానుందా? అనే ప్రశ్నపై జరిపిన ఒపీనియన్‌ సేకరణలో 87 శాతం మంది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని జవాబిచ్చారు. కాంగ్రెస్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం ఉండదని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. 3 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేదు. అయోధ్య రామాలయంలో జనవరి 22న జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాలని వీహెచ్‌పీ, రామాలయం ట్రస్టు సభ్యులు గత నెలలో సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్‌ను కలసి ఆహ్వానించారు.

Updated Date - Jan 12 , 2024 | 08:04 PM