Share News

Himanta Biswa Sarma: మేము పిలిస్తే.. కాంగ్రెస్‌కు హిమంత క్రాస్-ఓవర్ వార్నింగ్

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:32 PM

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఓ హెచ్చరిక జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన నేతల్లో చాలామంది బీజేపీలోకి (BJP) చేరుతారని పేర్కొన్నారు. కాబట్టి.. ఆ ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు.

Himanta Biswa Sarma: మేము పిలిస్తే.. కాంగ్రెస్‌కు హిమంత క్రాస్-ఓవర్ వార్నింగ్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఓ హెచ్చరిక జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన నేతల్లో చాలామంది బీజేపీలోకి (BJP) చేరుతారని పేర్కొన్నారు. కాబట్టి.. ఆ ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే సంగతి పక్కనపెట్టేస్తే.. అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీలో ఉంటారా? లేదా? అన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కాంగ్రెస్‌లో ఉండకూడదని అనుకుంటున్నారు. అందరూ బీజేపీలో చేరాలని కోరుకుంటున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ బీజేపీలోకి తీసుకురాగలిగితే.. అప్పుడు కాంగ్రెస్‌కి ఓటు వేయడం వల్ల లాభమేంటి?’’ అని హిమంత బిశ్వ శర్మ విలేకరులతో అన్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా మావాళ్లేనని ఆయన ఉద్ఘాటించారు. తాము పిలిస్తే చాలు.. వాళ్లు బీజేపీలోకి చేరుతారని కుండబద్దలు కొట్టారు.

నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి ప్రధానమంత్రి అవుతారని.. మైనారిటీ, మెజారిటీ అనే ప్రశ్న ఉండదని హిమంత ధీమా వ్యక్తం చేశారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మాత్రమే ఉంటుందని, ప్రతిపక్షం ఉండదని తేల్చి చెప్పారు. అస్సాం కాంగ్రెస్‌లో కొంతమంది మంచి నాయకులు ఉన్నారని, వారిని బీజేపీలో చేరమని తాను ఆహ్వానించానని, వారితో తాను టచ్‌లో ఉన్నానని వెల్లడించారు. కాగా.. హిమంత 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 03:32 PM