Share News

Delhi: బీజేపీలో చేరిన అర్విందర్‌ లవ్లీ..

ABN , Publish Date - May 05 , 2024 | 03:57 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)తో పొత్తును విభేదిస్తూ పార్టీని వీడిన ఢిల్లీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు.

Delhi: బీజేపీలో చేరిన అర్విందర్‌ లవ్లీ..

న్యూఢిల్లీ, మే 4 : ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)తో పొత్తును విభేదిస్తూ పార్టీని వీడిన ఢిల్లీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు. లవ్లీతోపాటు కాంగ్రెస్‌ మాజీ నేతలు రాజ్‌కుమార్‌ చౌహాన్‌, నసీబ్‌ సింగ్‌, నీరజ్‌ బసోయ, అమిత్‌ మాలిక్‌ కూడా కాషాయం కండువా కప్పుకున్నారు. ఆప్‌తో పొత్తు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపుల్లో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తూ వీరంతా కాంగ్రె్‌సను వీడారు.


కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి, పార్టీ జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే సమక్షంలో శనివారం బీజేపీలో చేరారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, ఆ తర్వాత ఢిల్లీలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అర్విందర్‌ సింగ్‌ లవ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2017లో తొలిసారి బీజేపీలో చేరిన లవ్లీ 2018లో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రె్‌సలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరారు.

Updated Date - May 05 , 2024 | 03:57 AM