Share News

Sunita Kejriwal: మోదీ దురహంకారంతోనే అరెస్టు చేశారు.. సునీతా కేజ్రీవాల్ ఆక్రోశం

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:40 PM

ఎక్సైజ్ పాలసీ సులో మనీలాండరింగ్ కింద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ను ఈడీ అరెస్టు చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. మోదీ అధికార దురహంకారంతోనే ఈ అరెస్టు చేశారంటూ ఆరోపించారు.

Sunita Kejriwal: మోదీ దురహంకారంతోనే అరెస్టు చేశారు.. సునీతా కేజ్రీవాల్ ఆక్రోశం

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy)కేసులో మనీలాండరింగ్ కింద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ (ED) అరెస్టు చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) ఘాటుగా స్పందించారు. మోదీ అధికార దురహంకారంతోనే ఈ అరెస్టు చేశారంటూ ఆరోపించారు. కేజ్రీవాల్ ఎప్పుడూ ప్రజల వెంటనే ఉన్నారని చెప్పారు. ఈమేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.


''మోదీజీ మీరు మూడుసార్లు ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని అధికార దురహంకారంతో అరెస్టు చేశారు. అందర్నీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీకు అండగా నిలిచారు. లోపల ఉన్నా బయట అయినా ఆయన జీవితం దేశానికే అంకింతం. ప్రజలందరికీ ఈ విషయం బాగా తెలుసు. జైహింద్'' అని సునీతా కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా, మనీలాండరింగ్ కింద అదుపులోనికి తీసుకున్న కేజ్రీవాల్‌ను అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. ఆయనను పది రోజులు రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా ఈడీ కోరింది. మద్యం కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి అని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు సౌత్ గ్రూప్ నుంచి ఆయన ముడుపులు తీసుకున్నారని, పంజాబ్ ఎన్నికల కోసం డబ్బులు డిమాండ్ చేసి, తమకు వచ్చిన ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనను విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 08:41 PM