Share News

Arvind Kejriwal: రాజీనామాపై కేజ్రీవాల్ క్లారిటీ.. వీలైతే ఆ పని చేస్తానంటూ తేల్చి చెప్పిన సీఎం

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:18 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టు అవ్వడంతో.. ఆయన రాజీనామా చేస్తారా? తదుపరి పరిణామాలేంటి? అనే చర్చలు మొదలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) అయితే.. కేజ్రీవాల్ రాజీనామా చేయరని, వీలైతే జైలు నుంచే పరిపాలన సాగిస్తారని తెలిపింది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పోస్టుకు రిజైన్ చేయనని తేల్చి చెప్పారు.

Arvind Kejriwal: రాజీనామాపై కేజ్రీవాల్ క్లారిటీ.. వీలైతే ఆ పని చేస్తానంటూ తేల్చి చెప్పిన సీఎం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టు అవ్వడంతో.. ఆయన రాజీనామా చేస్తారా? తదుపరి పరిణామాలేంటి? అనే చర్చలు మొదలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) అయితే.. కేజ్రీవాల్ రాజీనామా చేయరని, వీలైతే జైలు నుంచే పరిపాలన సాగిస్తారని తెలిపింది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పోస్టుకు రిజైన్ చేయనని తేల్చి చెప్పారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతానని స్పష్టం చేశారు. రోస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల రిమాండ్ విధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయను. అవసరమైతే.. జైలు నుంచే ప్రభుత్వం నడుపుతా. లోపలున్నా, బయటున్నా.. ప్రభుత్వం అక్కడి నుంచే నడుస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.


ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సుమారు రెండు గంటల పాటు విచారించిన అనంతరం కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (Enforcement Directorate) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈ క్రమంలో.. ఈ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ కీలక కుట్రదారుడిగా పేర్కొంది. అంతేకాదు.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని రూపొందించి అమలు చేసినందుకు గాను.. కేజ్రీవాల్ సౌత్ గ్రూపు నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు అందుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో 10 రోజుల కస్టడీని కోరుతూ ఈడీ దరఖాస్తు చేసుకోగా.. ఆరు రోజుల కస్టడీకి కోర్టు మంజూరు చేసింది. మరోవైపు.. సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) పేర్కొన్నారు. అసలు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 10:18 PM