Share News

Delhi: కాంగ్రెస్‌కు మరో షాక్‌! బీజేపీలో చేరిన ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌ బమ్‌..

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:07 AM

లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రె్‌సకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

Delhi: కాంగ్రెస్‌కు మరో షాక్‌! బీజేపీలో చేరిన ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌ బమ్‌..

  • నామినేషన్‌ ఉపసంహరించుకొని

  • తప్పుకొన్న ఇండిపెండెంట్లు.. ఇక సీటు బీజేపీదే!

  • కాంగ్రె్‌సకు మరో షాక్‌!

  • నామినేషన్‌ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌ బమ్‌.. తప్పుకున్న ముగ్గురు ఇండిపెండెంట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రె్‌సకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు. అక్షయ్‌ బమ్‌తో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. మే 13న ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ జరగాల్సి ఉంది.


సోమవారం మధ్యప్రదేశ్‌ మంత్రి, బీజేపీ నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ తన కారులో అక్షయ్‌ బమ్‌ను చూపిస్తూ తీసిన ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్టు చేయడంతో నామినేషన్‌ విత్‌డ్రా అంశం వెలుగులోకి వచ్చింది. అక్షయ్‌ బమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం మోహన్‌యాదవ్‌ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు పోస్టులో ఆయన పేర్కొన్నారు.

కాగా, గతవారం సూరత్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, వెనువెంటనే స్వతంత్ర అభ్యర్థులు కూడా తప్పుకోవడంతో ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండోర్‌లో కూడా బీజేపీకి ప్రధాన పోటీదారు అయిన కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో.. బరిలో చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులే ఉండటంతో కమలం అభ్యర్థి శంకర్‌ లాల్వానీ గెలుపు లాంఛనమే కానుంది.

Updated Date - Apr 30 , 2024 | 04:07 AM