Share News

Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!

ABN , Publish Date - Jan 13 , 2024 | 02:39 PM

ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌(Lakshadweep)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అనేక మంది పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నిలించింది.

Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!

ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌(Lakshadweep)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అనేక మంది పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నిలించింది. అంతేకాదు తాజాగా లక్షద్వీప్‌ను సందర్శించాలనుకునే ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో మరిన్ని అదనపు విమానాలను కూడా మొదలుపెట్టింది. ఈ తరుణంలో తాజాగా కొచ్చి అగట్టి కొచ్చికి అదనపు విమానాలను ప్రారంభించింది. వారానికి రెండు రోజులు అంటే ఆది, బుధవారాల్లో అదనపు విమానాలు నడుస్తాయని అలయన్స్ ఎయిర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

లక్షద్వీప్‌లో కొచ్చి, కేరళలోని అగట్టి ద్వీపం మధ్య ప్రయాణిస్తున్న ఏకైక విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్(Alliance Air). లక్షద్వీప్‌లో ప్రాంతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానయాన సంస్థ ప్రతిరోజూ 70 సీట్ల విమానాలను ద్వీపానికి నడుపుతోంది. ఇది ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తోందని మార్చి వరకు అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో టిక్కెట్ల గురించి తమను చాలా మంది ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో అదనపు విమానాలు ప్రారంభించినట్లు చెప్పారు. అవసరమైతే ఫ్లైట్ ఫ్రీక్వెన్సీని పెంచుతామని కూడా వెల్లడించారు.

Updated Date - Jan 13 , 2024 | 02:39 PM