Share News

Akhilesh Yadav: రష్యా విపక్షనేతతో అన్సారీని పోల్చిన అఖిలేష్.. కుటుంబసభ్యుల పరామర్శ

ABN , Publish Date - Apr 07 , 2024 | 08:29 PM

గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయనేతగా మారి ఇటీవలే జైలులో గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీని గత ఫిబ్రవరి 16న జైలులోనే మరణించిన రష్యా విపక్ష నేత అలెగ్జీ నవాల్నీతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోల్చారు. ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

Akhilesh Yadav: రష్యా విపక్షనేతతో అన్సారీని పోల్చిన అఖిలేష్.. కుటుంబసభ్యుల పరామర్శ

ఘజియాపూర్: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయనేతగా మారి ఇటీవలే జైలులో గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari)ని గత ఫిబ్రవరి 16న జైలులోనే మరణించిన రష్యా విపక్ష నేత అలెగ్జీ నవాల్నీ (Alexei Navalny)తో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పోల్చారు. ఉమర్ అన్సారీ తాతగారు దేశ స్వాంతంత్ర్య పోరాటంలో పోషించిన పాత్రను ప్రశంసించారు. అన్సారీ కుటుంబ సభ్యులను అఖిలేష్ యాదవ్ ఆదివారంనాడు పరామర్శించారు. అనంతర మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్తార్ అన్సారీ విషయంలో ఏమి జరిగిందనేది ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.


''ప్రతి ఒక్కరినీ అన్సారీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతకంటే షాకింగ్ ఏమిటంటే తనకు పాయిజనింగ్ జరుగుతోందని స్వయంగా అన్సారీనే చెప్పారు. మను, ఉమర్ అన్సారీల తాతగారికి స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్రా లేదా? ప్రభుత్వం ఈ విషయాలను దాచిపెడుతోంది'' అని అఖిలేష్ అన్నారు.

Lok Sabha Elections: 'రామ్ నామ్ సత్య్ హై' ఖాయం.. నేరస్థులకు యోగి వార్నింగ్


పేదలకు ఎంతో చేశారు..

అన్సారీ కుటుంబం పేదలకు ఎంతో సేవ చేసిందని అఖిలేష్ తెలిపారు. ''కొన్నిసార్లు ఒక వ్యక్తి ఇమేజ్‌ను దూరంగా కూర్చున్న వ్యక్తులు గుర్తించలేరు. ఎవరెవరో చెప్పినట్టుగా వారుండకపోవచ్చు. ఇప్పటికీ అన్సారీ కుటుంబం పేదల సంక్షేమానికి పాటుపడూతూనే ఉంది. అందవల్లే వేలాది మంది ప్రజలు ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు, వారి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేందుకు వచ్చారు. ఇది (అన్సారీ) సహజమరణమని ఎలా అంగీకరించగలం? రష్యాలోనూ విపక్ష నేతను జైలులోనే విషం ఇచ్చి చంపేశారు'' అని అఖిలేష్ అన్నారు. కాగా, తమకు ధైర్యం చెప్పి స్వాంతన పలికేందుకు వచ్చిన అఖిలేష్‌కు ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ ఉన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్తార్ అన్సారీ గత మార్చి 28న యూపీ జైలులో గుండెపోటు రావడంతో మరణించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 08:29 PM