Share News

Jairam Ram: ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి నాలుగు ప్రశ్నలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 06:06 PM

ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు ముహుర్తం ఖరారైంది. దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరనుంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ నాలుగు ప్రశ్నలు సంధించారు.

Jairam Ram: ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి నాలుగు ప్రశ్నలు

న్యూఢిల్లీ, జూన్ 06: ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు ముహుర్తం ఖరారైంది. దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరనుంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ నాలుగు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో మీరు హామీ ఇచ్చారనే విషయాన్ని ఈ సందర్బంగా మోదీకి ఆయనకు గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఈ హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీకి జైరాం రమేశ్ సూచించారు.


2014, ఏప్రిల్ 30న ఎన్నికల ప్రచారంలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని.. దీంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని జై రాం రమేశ్ గుర్తు చేశారు. కానీ ఈ పదేళ్లలో ఆ హమీ నెరవేర్చ దిశగా అడుగులు వేయలేదన్నారు. గతంలో ఇచ్చిన ఈ హమీని ఇప్పుడైనా మీరు నెరవేర్చాలంటూ మోదీని కోరారు.

అలాగే విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రతిపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకోవాలన్నారు. 2014 నాటి ఎన్నికల హామీలు.. అంటే ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక బిహార్‌లో కులాల సర్వే జరిగిందన్నారు. ఈ తరహా సర్వే దేశవ్యాప్తంగా చేయించగలరని మీరు హామీ ఇవ్వగలరా? అంటూ ప్రధాని మోదీని జైరాం రమేశ్ సూటిగా ప్రశ్నించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2024 | 06:48 PM