Share News

Actor Mansoor Ali Khan: సినీనటుడు మన్సూర్‌ అలీఖాన్‌ పోటీచేసే నియోజకవర్గం ఏదో తేలిపోయిందిగా...

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:29 PM

లోక్‌సభ ఎన్నికల్లో సినీనటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Actor Mansoor Ali Khan) వేలూరు నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఆయన ఇండియా జననాయగ పుళిగల్‌ అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

 Actor Mansoor Ali Khan: సినీనటుడు మన్సూర్‌ అలీఖాన్‌ పోటీచేసే నియోజకవర్గం ఏదో తేలిపోయిందిగా...

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో సినీనటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Actor Mansoor Ali Khan) వేలూరు నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఆయన ఇండియా జననాయగ పుళిగల్‌ అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తొలి మహానాడు గత నెల నగరంలో నిర్వహించిన మన్సూర్‌ అలీఖాన్‌ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమ వుతున్నారు. తిరువణ్ణామలై, శ్రీ పెరుంబుదూర్‌, దిండుగల్‌, ఆరణి, వేలూరు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీచేయనున్న అభ్యర్థుల జాబితాను పార్టీ కార్యాలయం గురువారం విడుదల చేసింది. అందులో మన్సూర్‌ అలీఖాన్‌ వేలూరు నుంచి పోటీచేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 01:29 PM