Share News

Actor Kamal Haasan: కమలహాసన్‌ పార్టీకి ‘టార్చిలైట్‌’ చిహ్నం..

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:04 AM

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి టార్చిలైట్‌ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది.

Actor Kamal Haasan: కమలహాసన్‌ పార్టీకి ‘టార్చిలైట్‌’ చిహ్నం..

చెన్నై: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి టార్చిలైట్‌ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. నటుడు కమలహాసన్‌(Actor Kamal Haasan) నేతృత్వంలో ఎంఎన్‌ఎం 2019 పార్లమెంటు ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో టార్చిలైట్‌ చిహ్నంపై పోటీ చేసింది. ఈ నేపథ్యంలో, పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరి(amil Nadu, Puducherry)లలో ఎంఎన్‌ఎం పార్టీకి ఎన్నికల సంఘం, టార్చిలైట్‌ చిహ్నం కేటాయించాలంటూ కమల్‌ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ఈసీ పరిగణనలోకి తీసుకుంది.

Updated Date - Feb 15 , 2024 | 11:04 AM