Share News

Sukesh Chandrashekhar: వారందరి బండారం బయటపెడతా.. సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ..

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:30 PM

రూ. 200 కోట్ల మోసం ఆరోపణలపై తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar) మరోసారి సంచలన లేఖ(letter) విడుదల చేశారు. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Sukesh Chandrashekhar: వారందరి బండారం బయటపెడతా.. సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ..
Sukesh Chandrashekhar

రూ. 200 కోట్ల మోసం ఆరోపణలపై తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar) మరోసారి సంచలన లేఖ(letter) విడుదల చేశారు. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్(delhi) జైల్లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. మాజీమంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారని తెలిపారు.

జైలు(jail) అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని సుకేశ్ లేఖలో వెల్లడించారు. మూడు రోజుల నుంచి జైల్ శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని చెప్పారు. స్టేట్మెంట్ ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఎవరు బెదరించినా తాను వెనక్కు తగేది లేదని సుకేశ్ స్పష్టం చేశారు. మొత్తం నేతల బండారం బయట పెడతానని వెల్లడించారు.


34 ఏళ్ల సూత్రధారి సుకేశ్ చంద్రశేఖర్ కర్ణాటక(karnataka)లోని బెంగళూరు నివాసి. అతను కాన్ గేమ్‌లో తన భాగస్వామి అయిన నటి లీనా మారియా పాల్‌ను వివాహం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి అతను చాలా త్వరగా ధనవంతుడు కావాలనుకున్నాడు. ఆ క్రమంలోనే సుకేశ్ 17 ఏళ్ల వయసులో మోసం కేసులో అరెస్టయ్యాడు.

అతను ఒక ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడి కుమారుడి స్నేహితుడినని చెప్పి కుటుంబ స్నేహితుడిని రూ. 1.5 కోట్లు మోసం చేశాడు. ఆ తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. సుకేశ్ మాజీ ముఖ్యమంత్రి మనవడిగా నటిస్తూ వందలాది మందిని మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. తర్వాత కింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో కంపెనీని ప్రారంభించి ఇన్వెస్టర్లను రూ.2000 కోట్ల మేర మోసం చేశాడు.


ఇది కూడా చదవండి:

RJD Manifesto: కోటి ఉద్యోగాలు ఇస్తాం, రక్షా బంధన్‌కు యువతులకు లక్ష .. ఆర్జేడీ మ్యానిఫెస్టోలో ఇంకా..

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 12:48 PM