Share News

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Feb 22 , 2024 | 12:13 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని కేజ్రీకి ఈడీ సమన్లు ఏడోసారి సమన్లు పంపించింది. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Delhi CM Kejriwal)కు మరోసారి ఈడీ (ED) సమన్లు పంపించింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని కేజ్రీకి ఈడీ ఏడోసారి సమన్లు పంపించింది. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది. మరోపక్క ఇదే కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia)ను పోలీసులు హాజరు పరిచారు. మనీష్ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీని మార్చి 12 వ తేదీ వరకూ రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. తదుపరి దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవరులో కోర్టుకు సీబీఐ (CBI) దాఖలు చేసింది. ఈ క్రమంలోనే స్టేటస్ రిపోర్ట్‌ను బయటపెట్టవద్దని కోర్టును కోరింది. విచారణ వివరాలను వెల్లడించలేమని సీబీఐ తెలిపింది.

సమన్లకు స్పందించని కేజ్రీవాల్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారకు డుమ్మాల మీద డుమ్మాలు కొడుతున్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆరు సార్లు సమన్లు పంపించిన ఈడీ తిరిగి నేడు మరోసారి పంపించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సమన్లు పంపడం చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చెబుతోంది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకూ ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది. ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా కేజ్రీవాల్‌ను గతంలో ఆరుసార్లు విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. నవంబర్ 2, నవంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.

Updated Date - Feb 22 , 2024 | 12:25 PM