Share News

Manipur: మణిపూర్‌లో తుపాకీల కలకలం.. నలుగురు అరెస్ట్..

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:10 PM

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్‌తో పాటు ఏడు మొబైల్ ఫోన్‌లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్‌బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్‌చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారు.

Manipur: మణిపూర్‌లో తుపాకీల కలకలం.. నలుగురు అరెస్ట్..

మణిపూర్‌ (Manipur)లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్‌తో పాటు ఏడు మొబైల్ ఫోన్‌లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్‌బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్‌చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారని తెలిపారు.

Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు

పుఖ్రేమ్, వఖీబా యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేశామని తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. గత ఏడాది కాలంగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అరెస్ట్‌లు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట్లో మెయిటీలు, కుకీల మధ్య జాతి వైరుధ్యంగా వివాదం మొదలైన విషయం తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 12:37 PM