Share News

Covid 19: పెరుగుతున్న కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు.. కొత్తగా ఎన్నంటే?

ABN , Publish Date - Jan 02 , 2024 | 04:59 PM

దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.

Covid 19: పెరుగుతున్న కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు.. కొత్తగా ఎన్నంటే?

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.

ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం(INSACOG) రిపోర్ట్ ప్రకారం... కేరళ (133), గోవా (51), గుజరాత్ (34), ఢిల్లీ (16), కర్ణాటక (8), మహారాష్ట్ర (9), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1) చొప్పున యాక్టివ్ కేసులున్నాయి. డిసెంబర్ లో తొలిసారి ఈ వేరియంట్ కేసుల్ని కనుక్కున్నారు. అయితే ఇది అంత ప్రమాదకరం కాదని వైద్యులు అంటున్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో 573 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా, క్రియాశీల కేసులు సంఖ్య మొత్తంగా 4,565 గా ఉన్నాయి.

Updated Date - Jan 02 , 2024 | 04:59 PM