Share News

Lok Sabha Polls 2024: లోక్‌సభ మొదటి దశ పోలింగ్ రేపే.. 2019లో పార్టీలు గెలిచిన సీట్లెన్నంటే

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:03 PM

లోక్‌సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 19న 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 17తో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.

Lok Sabha Polls 2024: లోక్‌సభ మొదటి దశ పోలింగ్ రేపే.. 2019లో పార్టీలు గెలిచిన సీట్లెన్నంటే

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 19న 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 17తో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

ఓటర్లు ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. ఈ దశ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలవుతాయి. మొదటి దశ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP), ఎన్‌డీఎ అభ్యర్థులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం లేఖ రాశారు. రామ నవమి సందర్భంగా మొదటి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు మోదీ అభ్యర్థులతో మాట్లాడారు.


2019 ఎన్నికల్లో..

2024లో తొలి దశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని 5, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్‌లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలోని ఒక్క స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. లక్షద్వీప్‌లోని 1 సీటు కూడా ఇందులో ఉంది.

AC Helmet: ట్రాఫిక్ పోలీసుల సమ్మర్ కష్టాలకు చెక్.. భలేగా ఏసీ హెల్మెట్.. విశేషాలివే

ఇవి కాకుండా రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక్కో సీటుకి తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీయే 41 స్థానాలు గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.


బరిలో ప్రముఖులు..

2024 లోక్‌సభ తొలిదశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ పోటీలో ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 07:19 PM