Share News

UK Evil Monster: మానవ రాక్షసుడు.. భార్యని చంపి, బాడీని 224 ముక్కలుగా నరికి..

ABN , Publish Date - Apr 07 , 2024 | 08:51 PM

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చి, ఆపై మృతదేహాన్ని 224 ముక్కలుగా కోశాడు. కొన్ని రోజుల పాటు బాడీ పార్ట్స్‌ని ప్లాస్టిక్ బ్యాగుల్లో దాచిన అతగాడు..

UK Evil Monster: మానవ రాక్షసుడు.. భార్యని చంపి, బాడీని 224 ముక్కలుగా నరికి..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో (United Kingdom) ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చి, ఆపై మృతదేహాన్ని 224 ముక్కలుగా కోశాడు. కొన్ని రోజుల పాటు బాడీ పార్ట్స్‌ని ప్లాస్టిక్ బ్యాగుల్లో దాచిన అతగాడు.. తన స్నేహితుడి సహకారంతో వాటిని నదిలో పడేశాడు. ఈ ఘటన బ్రిటన్‌లోని (Britain) లింకన్ నగరంలో (Lincoln City) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

మామిడితో కలిగే ఈ లాభాలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు

లింకన్ నగరంలో నివాసముంటున్న 28 ఏళ్ల నికోలస్ మెట్సన్‌ 2021లో 26 ఏళ్ల హోలీ బ్రామ్లీని వివాహమాడాడు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, క్రమంగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. కట్ చేస్తే.. 2023 మార్చి 17వ తేదీన బ్రామ్లీ అదృశ్యమైంది. ఏమైందోనని ఆందోళన చెందిన ఆమె తల్లి, సోదరి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మార్చి 24వ తేదీన నికోలస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకొని, బ్రామ్లీ గురించి అడిగారు. తనతో గొడవపడి, తనపై దాడి చేసి, మార్చి 19వ తేదీనే పుట్టింటికి వెళ్లిందని నికోలస్ చెప్పాడు.


అయితే.. బ్రామ్లీ ఇంటికి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలపడంతో, ఆ మరుసటి రోజు పోలీసులు మళ్లీ నికోలస్ ఇంటికి వెళ్లి, లోపలంతా పరిశీలించారు. బాత్‌‌రూమ్‌లోని టబ్‌లో రక్తం మరకలున్న బెట్‌ షీట్లు, బెడ్‌‌రూమ్‌ నేలపై రక్తపు మరకలు, కిచెన్‌లో రంపాన్ని గుర్తించారు. ఇవి చూసి.. నికోలస్ తన భార్యని చంపి ఉంటాడని భావించి, అతడ్ని అరెస్ట్ చేశారు. మొదట్లో తాను తన భార్యని హత్య చేయలేదని నికోలస్ వాదిస్తూ వచ్చాడు. ఇంతలో 2023 మార్చి 25న నదిలో తేలుతున్న ప్లాస్టిక్ బ్యాగులు కనిపించగా.. అవి అనుమానాస్పదంగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

చీరతో క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు

అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్లాస్టిక్ బ్యాగుల్ని పరిశీలించగా.. అందులో 224 ముక్కలుగా నరికిన మానవ శరీర భాగాలు ఉన్నాయని గుర్తించారు. వాటిని పరిశీలించగా.. అవి బ్రామ్లీ శరీర భాగాలేనని తేలింది. పలుమార్లు కత్తితో పొడిచి బ్రామ్లీని నికోలస్ హతమార్చి, ఇలా ముక్కలుగా నరికినట్లు నిర్ధారించారు. అలాగే.. అపార్ట్‌మెంట్ బయటున్న సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించినప్పుడు, ఆ ప్లాస్టిక్‌ బ్యాగులను లిఫ్ట్‌ ద్వారా బయటకు తరలించినట్లు కూడా రికార్డ్ అయ్యాయి. దీంతో.. నికోలస్‌తో పాటు ఈ హత్యలో సహకరించిన అతని స్నేహితుడ్ని దోషులుగా కోర్టు ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 08:51 PM