Share News

Baba Vanga: 2024లో నిజమైన బాబా వంగా జోస్యం.. అవి ఏంటంటే?

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:43 PM

బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు.

Baba Vanga: 2024లో నిజమైన బాబా వంగా జోస్యం.. అవి ఏంటంటే?

బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు. ఇప్పుడు 2024లోనూ ఆమె అంచనా వేసిన కొన్ని విషయాలు నిజమవుతున్నాయి. అవే.. క్యాన్సర్ వ్యాక్సిన్‌ని రష్యా అభివృద్ధి చేయడం, జపాన్ & యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం. ఈ రెండు సంఘటనల గురించి ఆమె గతంలోనే ప్రెడిక్ట్ చేయగా.. అవి నిజమయ్యాయి.


క్యాన్సర్ వ్యాక్సిన్

క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి విరుగుడు కోసం శాస్త్రవేత్తలు ఎంతోకాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే.. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ని రూపొందించడంలో ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నారని, ఇది త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. భవిష్యత్ సాంకేతికతలపై మాస్కో ఫోరమ్‌లో మాట్లాడుతూ.. ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌లు వ్యక్తిగత చికిత్స పద్ధతులుగా ఉపయోగించబడతాయని తాను ఆశిస్తున్నానని కూడా చెప్పారు. అయితే.. ఈ వ్యాక్సిన్ ఏయే క్యాన్సర్ రకాలను లక్ష్యంగా చేసుకొని తయారు చేస్తున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

జపాన్ & యూకేలో ఆర్థిక సంక్షోభం

అప్పుల స్థాయి విపరీతంగా పెరిగిపోవడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా.. జపాన్, యుకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సంక్షభంలో చిక్కుకున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం కారణంగా.. గతేడాది చివర్లో యూకే మాంద్యంలోకి కూరుకుపోయింది. గతంతో పోలిస్తే.. 2023 నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం తగ్గింది. ఇక జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా వరుసగా రెండు త్రైమాసికాలు కుచించుకుపోయింది. గతేడాదితో పోలిస్తే.. 2023 చివరి మూడు నెలల్లో ఆ దేశపు జీడీపీ 0.4 శాతం తగ్గిపోయింది. గతేడాదిలో ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో జర్మనీ కంటే నాల్గవ స్థానానికి పడిపోయింది.


2024కి సంబంధించి బాబా వంగా చెప్పిన ఇతర ప్రెడిక్షన్స్

* యూరప్‌లో ఉగ్రవాద దాడులు పెరుగుతాయి.

* భయానక వాతావరణ సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి.

* పవర్ గ్రిడ్స్, నీటి శుద్ధి ప్లాంట్ల సదుపాయాలను హ్యాక్టర్లు లక్ష్యంగా చేసుకుంటారు.

* రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తోటి దేశస్థుడు హత్యాయత్నానికి పాల్పడుతాడు.

* క్వాంటం కంప్యూటింగ్‌లో పెద్ద పురోగతి ఉంటుంది.

Updated Date - Feb 17 , 2024 | 04:43 PM