Share News

Deadly Virus: డెడ్లీ వైరస్‌తో చైనా ప్రయోగాలు.. 8 రోజుల్లోనే గాల్లోకి ప్రాణాలు!

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:58 PM

చైనీయులకు ఇదేం మాయరోగమో తెలీదు కానీ.. ప్రాణాంతకమైన వైరస్‌ల జోలికే వెళ్తుంటారు. దానిపై పరిశోధనలు చేసేదాకా ఊరికే ఉండరు. ఇప్పుడు మరో డెడ్లీ వైరస్‌పై ఆ చైనీయులు ప్రయోగాలు చేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వైరస్ పేరు ‘GX_P2V’ అని, ఎలుకలను 100 శాతం చంపేసే ప్రాణాంతకమైనదని బయోఆర్క్సివ్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

Deadly Virus: డెడ్లీ వైరస్‌తో చైనా ప్రయోగాలు.. 8 రోజుల్లోనే గాల్లోకి ప్రాణాలు!

చైనీయులకు ఇదేం మాయరోగమో తెలీదు కానీ.. ప్రాణాంతకమైన వైరస్‌ల జోలికే వెళ్తుంటారు. దానిపై పరిశోధనలు చేసేదాకా ఊరికే ఉండరు. ఇప్పుడు మరో డెడ్లీ వైరస్‌పై ఆ చైనీయులు ప్రయోగాలు చేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వైరస్ పేరు ‘GX_P2V’ అని, ఎలుకలను 100 శాతం చంపేసే ప్రాణాంతకమైనదని బయోఆర్క్సివ్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ఈ వైరస్‌ని ఇంజెక్ట్ చేసిన ఐదు రోజుల్లోనే ఎలుకలు గణనీయంగా తమ బరువుని కోల్పోయాయని.. జీవచ్చవంలా తయారయ్యాయని.. వాటి కళ్లు తెల్లగా మారాయని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు.. ఆ వైరస్ సోకిన ఎనిమిది రోజుల్లోనే ఆ ఎలుకలు మరణించినట్టు ఆ స్టడీ పేర్కొంది.


ఈ వైరస్ మానవులకు ఎంతో ప్రమాదకరమైనదని.. ఇది SARS-CoV-2 (కరోనా వైరస్)కి దగ్గరి సంబంధం కలిగి ఉందని పరిశోధకులు తెలిపారు. చనిపోయిన ఎలుకల శరీరాలను విశ్లేషించిన తర్వాత.. వాటి ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, శ్వాసనాళాలు, మెదడులపై ఈ వైరస్ ప్రభావం చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా.. మెదడుపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిందని, దాంతో ఆ ఎలుకలు చనిపోయాయని తేల్చారు. బీజింగ్ యూనివర్శిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ డెడ్లీ వైరస్‌ కొవిడ్ వ్యాప్తికి ముందు 2017లో పాంగోలిన్‌లలో కనుగొనబడింది. ఈ వైరస్ సోకిన ఎలుకల్లో 100 శాతం మరణాల రేటును నివేదించడం ఇదే మొదటిసారి అని.. పరిశోధనా బృందం ఆ అధ్యయనంలో రాసింది. అయితే.. ఇది మానవులను ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయంపై మాత్రం సరైన క్లారిటీ లేదు.

మరోవైపు.. ఈ డెడ్లీ వైరస్ అధ్యయనం గురించి తెలుసుకున్ననిపుణులు ఆన్‌లైన్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక భయంకరమైన ప్రయోగమని, మరింత ఆలస్యం కాకముందే ఈ పరిశోధనల్ని ఆపేయాలని సూచిస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద ప్రమాదమే సంభవించవచ్చన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా ఇలాంటి పరిశోధనలు అర్థంపర్థం లేనివని కొట్టిపారేస్తున్నారు. కాగా.. ఈ తాజా అధ్యయనానికి చైనా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో ఏమాత్రం సంబంధాలు లేవని తెలుస్తోంది.

Updated Date - Jan 17 , 2024 | 05:58 PM