Share News

Shehbaz Sharif: పాక్ 24వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:56 PM

పాకిస్థాన్‌ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Shehbaz Sharif: పాక్  24వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ (Pakistan) 24వ ప్రధానమంత్రి (Prime minister)గా షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif)సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీపీపీ నేత మురద్ అలీషా, సర్ఫరాజ్ బుగ్తి కూడా హాజరయ్యారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోడవంతో భావసారూప్యత కలిగిన పార్టీలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి ముత్తహిద క్వామి మూమెంట్ (ఎంక్యూఎం-పీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్యూ), బలోచిస్థాన్ అవామీ పార్టీ, పాకిస్థాన్ ముస్లింలీగ్ (జడ్), ఐస్తెహెకామ్-ఇ-పాకిస్థాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వాన్ని తిరిగి పట్టాల మీదకు తీసుకురావడం షెహబాజ్ ముందున్న ప్రధాన సవాలుగా చెబుతున్నారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడం మరో సవాలుగా ఉంది.

Updated Date - Mar 04 , 2024 | 04:56 PM