Share News

Pakistan: పాక్ ప్రధానిగా రెండోసారి పగ్గాలు చేపట్టనున్న షెహబాజ్

ABN , Publish Date - Feb 14 , 2024 | 09:24 PM

పాకిస్తాన్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. షెహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైంది. మూడుసార్లు ప్రధానిగా ఉన్న షెహబాద్ పెద్ద సోదరుడు నవాజ్ షరీప్ పీఎం రేసు నుంచి తప్పుకోవడంతో షెహబాజ్ పేరును పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల సమాచారం.

Pakistan: పాక్ ప్రధానిగా రెండోసారి పగ్గాలు చేపట్టనున్న షెహబాజ్

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ (Pakistan)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) రెండోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మూడుసార్లు ప్రధానిగా ఉన్న షెహబాజ్ పెద్ద సోదరుడు నవాజ్ షరీప్ పీఎం రేసు నుంచి తప్పుకోవడంతో షెహబాజ్ పేరును పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల సమాచారం.


ఇటీవల జరిగిన పాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో 264 పార్లమెంటు స్థానాలకు గాను పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతిచ్చిన 101 మంది ఇండిపెండెట్లు గెలుపొందారు. నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్ 80 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) రెండో స్థానం దక్కించుకుంది. అయితే ప్రధాని రేసులో తాము లేమని, పీఎంఎల్-ఎన్ సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతిస్తామని బిలావల్ బుట్టో జర్దారీ ప్రకటించారు. ప్రభుత్వంలో మాత్రం చేరేది లేదన్నారు. ఈ క్రమంలోనే పీఎం రేసు నుంచి తప్పుకోవడానికి నవాజ్ షరీఫ్ సైతం నిర్ణయించడంతో షెహబాజ్ ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Updated Date - Feb 14 , 2024 | 09:28 PM