Share News

Vladimir Putin: రష్యాలో కొనసాగుతున్న పోలింగ్.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ ఫిక్స్!

ABN , Publish Date - Mar 17 , 2024 | 07:44 AM

రష్యాలో అధ్యక్ష ఎన్నికల కోసం రెండో రోజైన శనివారం ఓటర్లు తమ ఓటు హక్కును జోరుగా వినియోగించుకున్నారు. అయితే ఈ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ వ్లాదిమిర్ పుతిన్(vladimir Putin) మరో 6 సంవత్సరాల ఎన్నిక అవుతారని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Vladimir Putin: రష్యాలో కొనసాగుతున్న పోలింగ్.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ ఫిక్స్!

రష్యా(Russia)లో అధ్యక్ష ఎన్నికల(president elections) కోసం రెండో రోజైన శనివారం ఓటర్లు తమ ఓటు హక్కును జోరుగా వినియోగించుకున్నారు. అయితే మొదటి దశ పోలింగ్(Polling) మార్చి 17న రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 7 నుంచి రెండో దశ పోలింగ్‌ ప్రారంభం కానుంది. మే 7న ఫలితాలు వెల్లడికానున్నాయి. దేశంలోని 11 'టైమ్ జోన్‌ల'తో పాటు ఉక్రెయిన్‌లోని అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో కూడా ఓటింగ్ జరుగుతోంది. అయితే ఈ అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్(vladimir Putin) మరో 6 సంవత్సరాల పదవీకాలం పాటు ఎన్నికకావడం ఖాయమని తెలుస్తోంది.


ఎందుకంటే పుతిన్ రాజకీయ ప్రత్యర్థులు జైలు(jail)లో లేదా ప్రవాసంలో ఉన్నారు. ఈ క్రమంలో పుతిన్‌కు గట్టి ప్రత్యర్థులు లేకుండా పోయారు. మరోవైపు కీలక ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ఫిబ్రవరిలో 47 ఏళ్ల వయస్సులో జైలులో మరణించారు. దీంతో పుతిన్‌(Putin)కు పోటీ లేకుండా పోయింది. మరోవైపు కఠినమైన నియంత్రణలు ఉన్నప్పటికీ పోలింగ్ స్టేషన్లలో డజనుకుపైగా విధ్వంసం కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో పలు దేశాల నాయకులు ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Explodes: ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. 100 మంది కార్మికులకు గాయాలు!

Updated Date - Mar 17 , 2024 | 07:47 AM