Share News

Viral News: ప్రాణాల మీదకు తెచ్చిన షేవింగ్.. నెల రోజులు కోమాలోకి.. అసలేమైందంటే?

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:22 PM

మనం ఎంత జాగ్రత్తగా షేవింగ్ చేసుకున్నా.. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు అనేది జరుగుతుంది. అలాంటి తప్పిదం కారణంగా.. ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లాడు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ‘సెప్సిస్’ (Blood Infection Sepsis) బారిన పడి.. కోమాలోకి (Coma) వెళ్లిపోయాడు. చివరికి వైద్యులు కూడా చేతులెత్తేసి.. బ్రెయిన్ డెడ్‌గా (Brain Dead) ప్రకటించారు. అలాంటి స్థితి నుంచి అతను కోలుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Viral News: ప్రాణాల మీదకు తెచ్చిన షేవింగ్.. నెల రోజులు కోమాలోకి.. అసలేమైందంటే?

మనం ఎంత జాగ్రత్తగా షేవింగ్ చేసుకున్నా.. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు అనేది జరుగుతుంది. అలాంటి తప్పిదం కారణంగా.. ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లాడు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ‘సెప్సిస్’ (Blood Infection Sepsis) బారిన పడి.. కోమాలోకి (Coma) వెళ్లిపోయాడు. చివరికి వైద్యులు కూడా చేతులెత్తేసి.. బ్రెయిన్ డెడ్‌గా (Brain Dead) ప్రకటించారు. అలాంటి స్థితి నుంచి అతను కోలుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని టెక్సాస్‌లో స్టీవెన్ స్పైనాల్ అనే 36 ఏళ్ల వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. ఎప్పట్లాగే అతను 2022లో తన గజ్జల వద్ద ఉన్న ఇన్‌గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. అయితే.. అది అతడ్ని ఊహించని పరిస్థితికి తీసుకెళ్లింది. ప్రాణాంతకమైన ‘సెప్సిస్’ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. క్రమంగా.. రక్తం గడ్డకట్టడం, డబుల్‌ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి వ్యాధులకు అది దారి తీసింది. చివరికి ఈ ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరడంతో.. అతడు కోమాలోకి వెళ్లాడు. అతనికి వైద్యం అందించిన డాక్టర్లు.. స్టీవెన్ బతికే అవకాశం కేవలం 4% మాత్రమే ఉందన్నారు. తామేమీ చేయలేమని చెప్పారు. అయితే.. చివరి ఆశగా అతడిని వెంటిలేటర్‌పై ఉంచి, దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ.. మెదడుకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్టీవెన్ మెల్లమెల్లగా కోలుకున్నాడు.


తన సోదరుడు స్టీవెన్ పరిస్థితి గురించి గురించి మిచెల్ టిక్‌టాక్‌ వీడియోలో పంచుకుంది. 2022 ఏడాది చివర్లో స్టీవెన్ అనారోగ్యానికి గురైనప్పటి నుంచి 2023 చివరికల్లా కోలుకునేదాకా.. అతని రికవరీ జర్నీ గురించి వివరించింది. చావుని ఎదురించి మరీ స్టీవెన్ కోలుకున్నాడని ఆమె పేర్కొంది. ఒక అరుదైన బ్యాక్టీరియా అతని శరీరాన్ని క్రమంగా దెబ్బతిస్తూ వచ్చిందని, దాంతో అతని అవయవాలు పని చేయడం ఆగిపోయాయని చెప్పింది. మొదట్లో అతనికేమైందో వైద్యులు గుర్తించలేకపోయారని, చివరికి ప్రాణాపాయ పరిస్థితిని చూసి కోమాలో ఉంచారని తెలిపింది. అతను బ్రెయిన్ డెడ్‌గా కూడా ప్రకటించబడ్డాడని.. అలాంటి సిచ్యుయేషన్ నుంచి బతికి బయటపడ్డాడని పేర్కొంది. అయితే.. అతని ఆపరేషన్ కోసం 8వేల డార్లు ఖర్చవ్వడంతో.. గోఫండ్‌మీ ద్వారా విరాళాలు అందించాల్సిందిగా ప్రజలకు అభ్యర్థించింది.

ఇంతకీ ఇన్‌గ్రోన్ హెయిర్ అంటే ఏమిటి?

ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు వంటి తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేక దిశలో షేవ్ చేసుకుంటే.. వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. వాటి మీద రాంగ్ డైరెక్షన్‌లో వెంట్రుకలు వస్తాయి. వాటినే ఇన్‌గ్రోన్ హెయిర్ అంటారు. సాధారణంగా.. ఈ దురదలు వచ్చినప్పుడు, చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. అయితే.. ఇన్‌గ్రోన్ హెయిర్ తొలగించినప్పుడు ఇన్ఫెక్షన్‌ సోకితే మాత్రం చాలా డేంజర్. నిర్లక్ష్యం వహిస్తే.. సెప్సిస్‌ అనే ప్రాణాంతక వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు చికిత్స చేసుకోకుండా వదిలేస్తే.. అవయవాలు క్రమంగా వైఫల్యమవుతాయి. దాంతో మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్‌ బారిన పడుతున్నారని, వారిలో దాదాపు 2,70,000 మంది మరణిస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 05:22 PM