Share News

Canada: ఈ యువతకేమైంది.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థికి హార్ట్ ఎటాక్..

ABN , Publish Date - Feb 16 , 2024 | 01:03 PM

యువత గుండెలు ఎందుకంత బలహీనంగా మారుతున్నాయి. రెండు పదుల వయసులోనే గుండెలపై అంత భారం ఎందుకు పడుతోంది. యువతకు తరచూ గుండె పోటు రావడానికి కారణాలేంటి.. ఇవన్నీ మేధావీ లోకాన్ని, శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలు. తాజాగా భారత్‌కు చెందిన ఓ విద్యార్థి కెనడా(Canada)లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.

Canada: ఈ యువతకేమైంది.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థికి హార్ట్ ఎటాక్..

ఒట్టావా: యువత గుండెలు ఎందుకంత బలహీనంగా మారుతున్నాయి. రెండు పదుల వయసులోనే గుండెలపై అంత భారం ఎందుకు పడుతోంది. యువతకు తరచూ గుండె పోటు రావడానికి కారణాలేంటి.. ఇవన్నీ మేధావీ లోకాన్ని, శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలు. తాజాగా భారత్‌కు చెందిన ఓ విద్యార్థి కెనడా(Canada)లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. అతని వయసు కేవలం 25 సంవత్సరాలే.

ఎదిగివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ దేశ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కి చెందిన అహ్మద్(25) కెనడా దేశం ఒంటారియోలోని ఓ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. 2022 నుంచి అతను తరచూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల అతనికి గుండె పోటు రావడంతో స్నేహితులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు.


ఈ విషయాన్ని అతని స్నేహితుడు అహ్మద్ మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్‌కు సోషల్ మీడియాలో చేరవేశాడు. బాధితుడిని స్వదేశానికి తీసుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు అమ్జద్ విన్నవించారు. కేంద్ర మంత్రి నుంచి ఇంకా దీనిపై స్పందన రాలేదు. అయితే యువతలో కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తరువాత గుండె పనితీరు మరింత మందగించిందని.. అతిగా వ్యాయామం చేయడం, ఒత్తిడి పెరుగుతుండటంతో హార్ట్ అటాక్ కేసులు పెరుగుతున్నట్లు వివరించారు. మంచి ఆహారం తీసుకుంటూ.. శరీరానికి అవసరమైనంత మేర వ్యాయామం చేస్తూ.. సమయానికి నిద్రపోతే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 01:03 PM