Share News

India-China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. సాయుధ ఘర్షణ తప్పదా?

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:26 PM

కొన్ని సంవత్సరాల నుంచి భారత్, చైనా (India-China Border Conflict) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. సాయుధ పోరాటానికి దారితీయొచ్చని అమెరికా నిఘా వర్గాలు (US Intelligence Reports) హెచ్చరించాయి. గతకొన్నేళ్ల నుంచి సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. ఇరుపక్షాల వారు భారీ స్థాయిలో సైనికుల్ని మోహరించడం, ఇలాంటి టైంలో చోటు చేసుకునే అపోహలు.. సాయుధ ఘర్షణకు ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

India-China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. సాయుధ ఘర్షణ తప్పదా?

కొన్ని సంవత్సరాల నుంచి భారత్, చైనా (India-China Border Conflict) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. సాయుధ పోరాటానికి దారితీయొచ్చని అమెరికా నిఘా వర్గాలు (US Intelligence Reports) హెచ్చరించాయి. గతకొన్నేళ్ల నుంచి సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. ఇరుపక్షాల వారు భారీ స్థాయిలో సైనికుల్ని మోహరించడం, ఇలాంటి టైంలో చోటు చేసుకునే అపోహలు.. సాయుధ ఘర్షణకు ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ మేరకు యూఎస్‌కు చెందిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNA) ఓ నివేదికను విడుదల చేసింది.


“భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. 2020 తర్వాత ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఎలాంటి సంఘర్షణలు చోటు చేసుకోలేదు కానీ, ఇరుపక్షాల వారు పెద్ద సంఖ్యలో సైనికుల్ని తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలో చోటు చేసుకునే అపోహలు, తప్పుడు అంచనాలతో.. సాయుధ ఘర్షణ ముప్పు పొంచి ఉంది’’ అంటూ యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు.. సైనిక విస్తరణ కోసం చైనా ప్రణాళికలు రచిస్తోందని, తన సైబర్ ఆపరేషన్లకు కూడా పదును పెడుతోందని ఆ నివేదిక హైలైట్ చేసింది. 2024 అమెరికా అధ్యక్ష (US President Elections 2024) ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా సాయశక్తులా ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే జబూటీ, కంబోడియాలో సైనిక స్థావరాలను నిర్మించిన చైనా.. మరిన్ని దేశాల్లో వీటిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టవచ్చని ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేర్కొంది. మయన్మార్‌, క్యూబా, పాకిస్థాన్‌, సీషెల్స్‌, శ్రీలంక, తజికిస్థాన్‌, టాంజానియా, యూఏఈ వంటి దేశాలు చైనా దృష్టిలో ఉన్నాయని తెలిపింది.

ఇదే సమయంలో.. ఇస్లామాబాద్ (Islamabad) నుంచి కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నా.. భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య సాయుధ పోరాటం మొదలవ్వొచ్చని ఈ డీఎన్ఏ నివేదిక వెల్లడించింది. ‘‘2021 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ప్రశాంతతను కొనసాగిస్తున్నాయి. అయితే.. ఈ కాలంలో తమ ద్వైపాక్షిక సంబంధాలను బలపరచుకోవడం కోసం ఇరువర్గాల వాళ్లు ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. తమ దేశీయ వ్యవహారాలపైనే దృష్టి సారించాయి. అయితే.. పాకిస్తాన్ పశ్చిమాన పెరుగుతున్న తీవ్రవాద దాడులు.. ఆందోళనకు గురి చేస్తున్నాయి. యాంటీ-ఇండియా మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్తాన్‌కి ఉంది. ఒకవేళ ఇస్లామాబాద్ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. సాయుధ పోరాటం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక్క సంఘటన జరిగినా.. అది సాయుధ ఘర్షణకు ప్రేరేపించవచ్చు’’ అని ఆ నివేదిక అభిప్రాయపడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 05:26 PM