Share News

London: నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Mar 25 , 2024 | 12:14 PM

నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్‌‌పై వస్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొంది. తీవ్ర గాయాలైన కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు. కొచ్చర్ మృతిని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

London: నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి

లండన్: నీతి ఆయోగ్ (NITI Aayog) మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) (Cheistha Kochhar) లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్‌‌పై వస్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్ బలంగా ఢీ కొంది. తీవ్ర గాయాలైన కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు. కొచ్చర్ మృతిని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ (Amitabh Kanth) సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

విషాదం

‘లైఫ్ ప్రోగ్రామ్‌లో చీస్తా కొచ్చర్ తమతో కలిసి పనిచేసింది. లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు లండన్ వెళ్లింది. జీవితంలో మరింత ఉన్నత స్థానంలోకి వెళ్లాల్సిన సమయంలో విషాద ఘటన జరిగింది. చీస్తా కొచ్చర్ తెలివైంది, ధైర్యవంతురాలు. త్వరగా మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది అని’ ఎక్స్‌లో అమితాబ్ కాంత్ పోస్ట్ చేశారు. మార్చి 19వ తేదీన చెత్త తీసుకెళ్లే ట్రక్ కొచ్చర్‌ను ఢీ కొంది. ఆ సమయంలో ఆమె భర్త అక్కడే ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు.

గురుగ్రామ్ టు లండన్

‘లండన్‌లో చీస్తా కొచ్చర్ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది అని’ చీస్తా కొచ్చర్ తండ్రి లెప్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ లింక్‌డిన్‌లో రాసుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చీస్తా దంపతులు లండన్ వెళ్లారు. అంతకుముందు గురుగ్రామ్‌లో నివసించారు. ఢిల్లీ యూనివర్సిటీ, అశోక వర్సీటి, యూనివర్సిటీస్ ఆఫ్ పెన్సిల్వేనియా, చికాగోలోనూ చీస్తా కొచ్చర్ చదువుకున్నారు. 2021-23 వరకు నీతి ఆయోగ్‌లో నేషనల్ బిహేవియరల్ ఇన్ సైట్స్ విభాగంలో సీనియర్ సలహాదారుగా పనిచేశానని చీస్తా కొచ్చర్ లింక్‌డిన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Simon Harris: చిన్న వయస్సులోనే ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి

Updated Date - Mar 25 , 2024 | 12:14 PM