Share News

‘భారత్ చీరలను ముందు మీరు తగలబెట్టండి’

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:40 PM

బంగ్లాదేశ్‌లో బాయ్‌కాట్ ఇండియా పేరిట.. భారత వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతోంది. భారతదేశానికి చెందిన చీరలు, మషాళా దినుసులను వ్యతిరేకించాలంటూ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (భీఎన్‌పి) పిలుపునిచ్చింది.

‘భారత్ చీరలను ముందు మీరు తగలబెట్టండి’

డాకా, ఏప్రిల్1 : బంగ్లాదేశ్‌లో బాయ్‌కాట్ ఇండియా ఉత్పత్తులు (Boycott Indian products) పేరిట.. భారత వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతోంది. భారతదేశానికి చెందిన చీరలు, మషాళా దినుసులను వ్యతిరేకించాలంటూ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (భీఎన్‌పి) (Bangladesh Nationalist Party) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ (Awami League party) అధ్యక్షురాలు షేక్ హసీనా (Sheikh Hasina)సోమవారం కాస్తా ఘాటుగా స్పందించారు.

ముందుగా బీఎన్‌పీ నాయకుడి భార్యల వద్దనున్న భారతీయ చీరలను ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ చీరలను ముందుగా తలగబెట్టాలని బాయ్‌కాట్ ఇండియా ప్రచార కర్తలకు సూచించారు. పార్టీ కార్యాలయం ముందు మీ భార్యల కట్టుకొనే భారతీయ చీరలు ఎందుకు దగ్దం చేయడం లేదంటూ వారిని ప్రధాని షేక్ హసీనా ప్రశ్నించారు. మీరు అలా చేస్తే.. నిజమైన భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్న వారిగా ప్రజల్లో నిరూపించు కొన్నట్లవుతోందని సదరు ప్రచార కర్తలకు ప్రధాని షేక్ హసీనా చురకలంటించారు.

మరోవైపు ప్రతిపక్ష బీఎన్‌పీ నాయకులు, వారి సతీమణులు భారత్ నుంచి చీరలు కొనుగోలు చేసి బంగ్లాదేశ్‌కు తీసుకు వచ్చి విక్రయించే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. గతంలో ఇదే బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీలోని నాయకుల భార్యలు గుంపులు గుంపులుగా భారత్‌ వెళ్లి.. అక్కడ చీరలు కొనుగోలు చేసి.. వాటిని బంగ్లాదేశ్‌లో విక్రయించడం తాను చూశానని ప్రధాని షేక్ హసీనా ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

అదీకాక గరమ్ మసాలా.. ఉల్లిపాయి, వెల్లుల్లి, అల్లంతోపాటు ఇతర మషాళా దినుసులను భారత్ నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకొంటుందన్నారు. అయితే దిగుమతి చేసుకున్న ఈ మషాళ దినుసులు లేకుండా.. ప్రతిపక్ష బీఎన్‌పీ నేతలు ఆహారాన్ని వండుకు తినలేక పోతున్నారని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని షేక్ హసీనా వ్యంగ్యంగా పేర్కొన్నారు.

ఇక ప్రధాని షేక్ హసీనా వివిధ సందర్భాల్లో భారత్ గొప్ప స్నేహితుడని పేర్కొంటు వస్తున్నారు. అయితే అధికార అవామీ లీగ్‌ పార్టీతోపాటు ఆ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా.. ఇండియా బ్రాండ్‌కు అనుకూలంగా పని చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. హసీనాకు వివిధ సందర్భాల్లో భారతీయ నాయకులు చీరలు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని సైతం ప్రతిపక్ష బీఎన్‌పీ ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది.

ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ అత్యధిక స్థానాలను గెలుచుకొంది. దీంతో వరుసగా నాలుగో సారి షేక్ హసీనా ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఎన్నికల్లో షేక్ హసీనా గెలవడంలోనే కాదు.. బంగ్లాదేశ్ దేశ రాజకీయాల్లో సైతం భారత్ జోక్యం చేసుకొంటుందని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రదానంగా ఆరోపిస్తోంది. ఆ క్రమంలో భారత్‌కు చెందిన చీరలు, మషాల దినుసులను వ్యతిరేకించాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

మరిన్నీ అంతర్జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Viral Video: భారత సంతతి వైద్యురాలికి ఎలాన్ మస్క్ సాయం!

Air Force One: అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‍‌ఫోర్స్ వన్’లో వరుస చోరీలు.. తెరవెనుక ఎవరో తెలిస్తే షాకే!

Updated Date - Apr 01 , 2024 | 07:50 PM