Share News

Viral News: వ్యక్తికి నరకం చూపించిన ఫోన్.. 36 గంటలు డ్రైనేజీలోనే.. అసలేమైందంటే?

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:13 PM

తన మొబైల్ ఫోన్ వల్ల ఓ వ్యక్తికి కనీవినీ ఎరుగని అనూహ్య అనుభవం ఎదురైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 36 గంటల పాటు అతడు నరకం చూవిచూశాడు. డ్రైనేజీలో చిక్కుకొని విలవిల్లాడాడు. చివరికి అదృష్టం కలిసిరావడంతో.. ఒకటిన్నర రోజుల తర్వాత అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Viral News: వ్యక్తికి నరకం చూపించిన ఫోన్.. 36 గంటలు డ్రైనేజీలోనే.. అసలేమైందంటే?

తన మొబైల్ ఫోన్ (Mobile Phone) వల్ల ఓ వ్యక్తికి కనీవినీ ఎరుగని అనూహ్య అనుభవం ఎదురైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 36 గంటల పాటు అతడు నరకం చూవిచూశాడు. డ్రైనేజీలో (Underground Drain) చిక్కుకొని విలవిల్లాడాడు. చివరికి అదృష్టం కలిసిరావడంతో.. ఒకటిన్నర రోజుల తర్వాత అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. ఆ తర్వాత మరో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

బ్రిస్బేన్ వీధుల్లో ఓ వ్యక్తి ఫోన్ చూస్తూ నడుచుకొని వెళ్తుండగా.. అనుకోకుండా అతని చేతి నుంచి ఫోన్ జారి, నేరుగా డ్రైనేజ్‌లో పడిపోయింది. దాన్ని తీసేందుకు అతడు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తూ డ్రైనేజ్‌లో చిక్కుకున్నాడు. అప్పటి నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు. దీంతో.. తనని సహాయం చేయాలని కోరుతూ కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న ఓ కార్మికుడు ఆ కేకలు విని, డ్రైనేజ్ వద్దకు వెళ్లి చూశాడు. లోపల చిక్కుకున్న వ్యక్తిని చూసి.. సహాయం చేస్తానని చెప్పాడు. కానీ.. ఎందుకో డ్రైనేజ్‌లో చిక్కుకున్న వ్యక్తి సహాయం వద్దని తిరస్కరించాడు. దాంతో.. ఆ కార్మికుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


కట్ చేస్తే.. మరుసటి రోజు మళ్లీ అదే కార్మికుడు అటుగా వెళ్లినప్పుడు, ‘రక్షించండి’ అనే కేకలు మరోసారి విన్నాడు. దీంతో అతను వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ఆపై అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని శరీరంపై స్వల్ప గాయాలున్నట్టు వైద్యులు తెలిపారు. అసలు డ్రైనేజీలో ఎలా చిక్కుకున్నావని అతడ్ని ప్రశ్నించగా.. తన ఫోన్ అందులో పడిపోయిందని, దాన్ని తీసే క్రమంలో అనుకోకుండా చిక్కుకున్నానని చెప్పాడు. డ్రైనేజ్ నీళ్లు తాగుతూ లోపల గడిపానని చెప్పుకొచ్చాడు.

IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.1 కోటి ఢమాల్.. భర్త చేసిన పనికి పాపం భార్య!

మరి.. మొదటిసారి సహాయం చేస్తానని ఆ కార్మికుడు చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఎందుకు తిరస్కరించాడు? అనేది అనుమానాలు రేకెత్తించింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం ఒక కారు పలు వాహనాల్ని ఢీ కొట్టుకుంటూ వెళ్లిందని, అనంతరం డ్రైవర్ ఆ కారులో నుంచి దూకి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. ఆ వ్యక్తి ఇతడే అయ్యుండొచ్చని, తప్పించుకోవడం కోసమే డ్రైనేజీలో దాక్కొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత.. పూర్తి విచారణ జరుపుతామని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 10:13 PM