Share News

Cellphone Network: మొబైల్ నెట్‌వర్క్ అంతరాయానికి గురైన కస్టమర్‌లకు రూ.400.. కీలక ప్రకటన

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:19 AM

అగ్రరాజ్యం అమెరికా(america)లో ఇటివల అనేక మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు సోషల్ మీడియాలో ఈ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగిందని పోస్టులు చేశారు. దీనిపై కంపెనీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

Cellphone Network: మొబైల్ నెట్‌వర్క్ అంతరాయానికి గురైన కస్టమర్‌లకు రూ.400.. కీలక ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా(america)లో ఇటివల అనేక మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం సేవల్లో(cellphone network outage) అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు సోషల్ మీడియాలో ఈ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగిందని పోస్టులు చేశారు. అయితే ఈ అంశంపై AT&T T.N కంపెనీ స్పందించింది. ఆ క్రమంలో సెల్యులార్ సర్వీస్ అంతరాయం సమయంలో కస్టమర్‌లు Wi-Fi కాలింగ్, ఇలాంటి ఇంటర్నెట్ ఆధారిత సేవలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. సమస్యకు కారణమేమిటనేది వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ ఇది రాత్రిపూట నెట్‌వర్క్ నిర్వహణలో సంభవించిన సమస్య ఫలితంగా జరిగిందని సైబర్ దాడి ఫలితం కాదని తెలిపింది.

ఆదివారం చేసిన ట్వీట్‌, దాని వెబ్‌సైట్‌లోని కొత్త పేజీలో క్యారియర్ అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నట్లు సంస్థ పోస్ట్ చేసింది. ఈ అంతరాయం కలిగించిన నిరాశను గుర్తించి, దీన్ని సరి చేయడంలో, ప్రభావితమయ్యే కస్టమర్‌లను చేరుకుంటున్నామని పేర్కొంది. అంతేకాదు వారి ఖాతాలకు స్వయంచాలకంగా క్రెడిట్‌ను వర్తింపజేస్తామని వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మా కస్టమర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా కనెక్ట్ అవడానికి మా నిబద్ధత గురించి మేము వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పింది. ఈ క్రమంలో మేము ఆ పూర్తి రోజు సేవలకు గాను సగటు ధరను వారికి క్రెడిట్(credit) చేస్తున్నామని స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో AT&T సంస్థ ప్రతి వినియోగదారునికి 5 డాలర్లు (దాదాపు రూ.400) ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎవరైనా వారి పరిస్థితి గురించి తమతో మాట్లాడవలసి వస్తే కాల్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది. అయితే ఈ నెట్‌వర్క్ అంతరాయం వల్ల ఎంత మంది వినియోగదారులు ప్రభావితమయ్యారనేది తెలియాల్సి ఉంది. వినియోగదారులకు ఈ అంతరాయాలు గత గురువారం వచ్చినట్లు గుర్తించారు. శాన్ ఫ్రాన్సిస్కోతో సహా ప్రధాన నగరాల్లో కాల్స్(calls), సందేశాలు, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Dubai: భారతీయుల కోసం దుబాయ్ కొత్త వీసా.. దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే జారీ!

Updated Date - Feb 26 , 2024 | 11:20 AM