Old Forest: ప్రపంచంలో పురాతన అడవీని గుర్తించిన అమెరికా
ABN , Publish Date - Jan 13 , 2024 | 05:50 PM
ప్రపంచంలో పురాతన అడవీని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. న్యూయార్క్‌లో గల కైరో సమీపంలో ఉందని చెబుతున్నారు. అక్కడ ఉన్న శిలజాలు, వృక్షాలను బట్టి అడవీ 385 మిలియన్ ఏళ్ల నాటిదని గుర్తించారు.
ప్రపంచంలో పురాతన అడవీని అమెరికా పరిశోధకులు (Researchers) కనుగొన్నారు. న్యూయార్క్‌లో (New York) గల కైరో సమీపంలో ఆ అడవీ ఉందని చెబుతున్నారు. అక్కడ ఉన్న శిలజాలు, వృక్షాలను బట్టి ఫారెస్ట్ 385 మిలియన్ ఏళ్ల నాటిదని గుర్తించారు. ములాలను అభివృద్ధి చేయడంలో చెట్లు దోహద పడ్డాయని వివరించారు.
అడవీ గురించి ఇప్పటికే తెలుసు అని పరిశోధకులు చెబుతున్నారు. అక్కడ పెరుగుతున్న మొక్కలు, వృక్షాల వయస్సు తెలుసుకోవడానికి తొలి ప్రయత్నం చేశామని వివరించారు. డైనోసార్ల కాలంలో ఉనిలో ఉన్న వృక్షాలను పరిశోధకులు గుర్తించారు. అడవీ 400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. విభిన్న మొక్కలు, శిలాజాలను పరిశీలించి పురాతన అడవీ అని వారు నిర్దారించారు. ఇప్పటివరకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, జపాన్‌లో యకుషిమా ఫారెస్ట్ మాత్రమే ప్రపంచంలో పురాతనమైనవి. ఇప్పుడు ఆ జాబితాలో కైరో సమీపంలో ఉన్న అడవీ చేరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.