Share News

Wooden Cooking Utensils: చెక్కతో చేసిన వంట పాత్రలు ఎందుకు వాడాలి? ఈ కారణాల లిస్ట్ చూస్తే..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:51 PM

ఐరన్, అల్యూమినియం వస్తువులను వదిలేసి చెక్కతో చేసిన వంట పాత్రలు వాడటం వల్ల లాభాలుంటాయా? అసలు నిజాలివీ..

Wooden Cooking Utensils:  చెక్కతో చేసిన వంట పాత్రలు ఎందుకు వాడాలి? ఈ కారణాల లిస్ట్ చూస్తే..!

ఒకప్పుడు వంటింట్లో మట్టిపాత్రలు ఉపయోగించేవారు. అయితే వాటి స్థానంలో అల్యూమినియం, ఐరన్ పాత్రలు వచ్చిచేరాయి. అడపాదడపా కొందరు మళ్లీ మట్టి, చెక్క పాత్రలను ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టౌ మీద మంట మీద ఉంచడం అనే మాట అటుంచితే.. కూరలు కలపడానికి, ఏదైనా వేసుకోవడానికి, కూరగాయలు తరగడానికి, మసాలా దినుసులు నూరుకోవడానికి చెక్కతో చేసిన వస్తువులు వాడుతుంటారు. ఐరన్, అల్యూమినియం వస్తువులను వదిలేసి చెక్కతో చేసిన వస్తువులు వాడటం వల్ల బోలెడు లాభాలుంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

నాన్-రియాక్టివ్ మెటీరియల్..

అల్యూమినియం, తక్కువ-నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన పాత్రల్లా కాకుండా చెక్కతో చేసిన వంట పరికరాలైన గరిటెలు, స్పూన్లు, కట్టింగ్ బోర్డులు రియాక్టివ్‌గా ఉండవు. దీనర్థం చెక్క వంట పాత్రలు లోహ పాత్రల వంటి ఆల్కలీన్ లేదా ఆమ్ల పదార్థాలతో స్పందించవు . ఈ రసాయన ప్రతిచర్యలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. చెక్క వంట పాత్రలను ఉపయోగించడం వల్ల ఆహారం రుచిని, ఆరోగ్యాన్ని రుచిని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Pressure Cooker: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకండి!



హీట్ రెసిస్టెన్స్..

చెక్క పాత్రలకు వేడిని పాస్ చేసే గుణం తక్కువ. దీనర్థం ఐరన్, అల్యూమినియం వస్తువులను తాకగానే పుట్టేంత వేడి చెక్క వస్తువులను తాకగానే పుట్టదు.వేడి పాన్‌లు, కుండలలో చెక్క వంట పరికరాలను సులభంగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, చెక్క పాత్రలు ఆహారాన్ని తిప్పడానికి, కదిలించడానికి అనువుగా ఉంటాయి

తుప్పు పట్టవు..

చెక్క వంట పాత్రలు ఐరన్, అల్యూమినియం పాత్రల్లా ఎక్కువకాలం తడికి గురవడం వల్ల తుప్పు పట్టే స్వభావం కలిగి ఉండదు. ఈ తుప్పు పట్టిన స్థితిలో ఆహారం వండితే శరీరానికి హానికరం. అయితే చెక్క పాత్రల వల్ల ఇలాంటి ప్రమాదం ఉండదు. చెక్క పాత్రలను జాగ్రత్తగా వాడుకుంటే చాలాకాలం మన్నిక వస్తాయి. వీటిని అన్నిరకాల వంటలు చేయడానికి ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: వావ్.. ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్ గురించి తెలిస్తే షాకవుతారు..!


యాంటీ బాక్టీరియల్..

ప్లాస్టిక్, మెటల్ పాత్రలకు విరుద్ధంగా, చెక్కతో చేసిన వంట పాత్రలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిములను చంపుతాయి. ఆహారాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తాయి. మెటల్, అల్యూమినియం పాత్రలకు బదులుగా పైన్, ఓక్, టేకుతో చేసిన చెక్క వంట సాధనాలు వాడితే చాలా మంచిది.

పర్యావరణ అనుకూలం..

చెక్క వంట పాత్రల గురించిన చెప్పుకోదగ్గ గొప్ప అంశం అవివెదురు లేదా ఇతర కలపతో తయారు కాబడతాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి. ముఖ్యంగా వీటి వాడకం వల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చు. వేడిగా ఉన్న ఆహారాలను ప్లాస్టిక్ పాత్రలలో వేయడం కంటే చెక్కవాటిలో వేయడం ఉత్తమం. ఇవి కాలుష్యరహితమైనవి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 12:51 PM