Share News

Wheezing in Breathing: ఊపిరి పీల్చుకునేటప్పుడు మీకూ గురక వస్తుందా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:00 PM

శ్వాస తీసుకునేటప్పుడు గురక రావడం గురించి వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..

Wheezing in Breathing: ఊపిరి పీల్చుకునేటప్పుడు మీకూ గురక వస్తుందా?  వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!

మనిషి మనుగడకు శ్వాస ప్రధానం. ఆహారం, నీరు లేకపోయినా మనిషి కొద్ది రోజులు అయినా మనుగడ సాగించగలుగుతాడు కానీ శ్వాస లేకపోతే మాత్రం కొన్ని నిమిషాల లోపే ప్రాణాలు కోల్పోతాడు. చాలామంది శ్వాస తీసుకునేటప్పుడు గురక వస్తుంటుంది. ఇలా గురక రావడం వల్ల కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి. ఈ సమస్య ఈ మధ్య కాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నప్పటికీ తగినంత అవగాహన మాత్రం లేదు. అసలు శ్వాస తీసుకునేటప్పుడు గురక ఎందుకు వస్తుంది. దీని వెనుక ఉన్న షాకింగ్ నిజాలేంటి? వైద్యులు దీనిగురించి ఏం చెబుతున్నారో తెలుసుకుంటే..

శ్వాస తీసుకునేటప్పుడు గురక వచ్చినట్టు చాలామంది అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది ఆస్తమా లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. శ్వాసనాళాలు సంకుచితం కావడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు ఆటంకం ఏర్పడి గురక వస్తుంది. ఊపిరితిత్తులకు గాలి చేరడంలో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలోనూ.. వర్షాకాలంలోనూ తేమ కారణంగా ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలలో వాపులు పెరుగుతాయి. దీని కారణంగా ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారికి ఈ సమస్య సవాలుగా మారుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థలో అంతర్గత పొరను ప్రభావితం చేస్తుంది. వాయుమార్గాలను మరింత సున్నితంగా చేస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!


కొందరిలో శ్వాసకోశ నాళాలు అడ్డుపడటం లేదా సంకోచించడం వల్ల శ్వాసలో గురక వస్తుంది. సంకోచానికి ఒకటికంటే ఎక్కువ కారణాలు కూడా ఉండవచ్చు. శ్వాసకోశనాళాల కణజాలంలో వాపు, గాలిగొట్టాల లైనింగ్లో ఉండే చిన్న కండరాలలో గాలి లేదా శ్లేష్మం పేరుకుపోవడం మొదలైనవి కూడా శ్వాసలో గురకకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ సమస్య చిన్నపిల్లలకు ఎక్కువగా వస్తుంటుంది. 5ఏళ్లలోపు పిల్లలకు ఈ సమస్య వచ్చే అవకాశాలెక్కువ. ఇది ఆస్తమాగా మారితే యుక్తవయసు వరకు అలాగే కొనసాగుతుంది. ఇందులో శ్వాసకోశ నాళాలు తగ్గిపోతాయి. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. ఊపిరాడకుండా ఉండే పరిస్థితి ఎక్కువ అవుతుంది. గురక లేదా ఈల శబ్దం. ఛాతీ బిగుతుగా మారడం, విశ్రాంతి లేకపోవడం, దగ్గు.. తలలో భారం, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!

జాగ్రత్తలు..

క్రమం తప్పకుండా మందులు వాడాలి.

ఇంటి ప్రాంతాలు పొడిగా ఉంచుకోవాలి. ఎక్కడా తేమ ఉండకుండా జాగ్రత్త పడాలి.

బాత్రూమ్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. బ్యాక్టీరియా తొలగించేందుకు వీలుగా సహజమైన పదార్థాలను క్లీనింగ్ కు వినియోగించాలి.

ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించాలి.

పడకగదికి దగ్గర్లో మొక్కలు ఉండకూడదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 03:00 PM