రోజూ  గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!

గోరువెచ్చని నీరు ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది.  ఒత్తిడి హార్మోన్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.

వేడినీటితో స్నానం చేయడం వల్ల ఆర్థరైటిస్,  కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.  కండరాలు, శరీరం రిలాక్స్ అవుతాయి.

పడుకునేముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే నిద్ర బాగా వస్తుంది.

40 నుండి 43డిగ్రీల సెల్సియస్ వరకు వేడి ఉన్న నీటితో స్నానం చేస్తే మెదడు పనితీరు పెరుగుతుంది. జ్ఞాపకశక్తిని, మెదడు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.

రోజూ వేడినీటితో స్నానం చేసేవారిలో గుండె జబ్బుల ముప్పు 28శాతం, పక్షవాతం ముప్పు 26శాతం తక్కువగా ఉంటాయి.

రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా వేడినీటి స్నానం సహాయపడుతుంది.