Share News

Vitamin-E Capsule: సరైన ఫలితాలు కావాలంటే విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా వాడాలి? వీటిని ఎవరు వాడుకూడదంటే..!

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:26 PM

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉండే సౌందర్య సాధనం విటమిన్-ఇ క్యాప్సూల్. దీన్ని ముఖానికి రాసుకుంటే అందంగా కనిపిస్తామని అంటుంటారు. అయితే దీన్ని ఎవరు వాడకూడదంటే..

Vitamin-E Capsule: సరైన ఫలితాలు కావాలంటే విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా వాడాలి?  వీటిని ఎవరు  వాడుకూడదంటే..!

చర్మ సంరక్షణ కోసం తరచుగా చాలా ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అమ్మాయిలు చాలా వరకు ట్రెండింగ్‌లో ఉన్న ఎన్నో ఉత్పత్తులను, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రెమిడీస్ ను వాడుతుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉండే సౌందర్య సాధనం విటమిన్-ఇ క్యాప్సూల్. దీన్ని ముఖానికి రాసుకుంటే అందంగా కనిపిస్తామని అంటుంటారు. అయితే విటమిన్-ఇ క్యాప్సూల్ చర్మానికి ప్రయోజనకరమైనది అయినప్పటికీ, కొంతమంది దీనిని ఉపయోగించకూడదు. సరైన ఫలితాలు కావాలంటే విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా ఉపయోగించాలి? విటమిన్-ఇ క్యాప్సూల్ ఎవరు ఉపయోగించకూడదు? పూర్తీగా తెలుసుకుంటే..

విటమిన్-ఇ క్యాప్సూల్ ఎలా ఉపయోగించాలి?

జిడ్డు చర్మం లేదా పొడి చర్మం లేనివారు విటమిన్-ఇ క్యాప్సూల్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే నూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంపై మెరుపును కూడా తెస్తుంది. చర్మం మరింత ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని ఒక ప్యాక్ లేదా మాస్క్‌లో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అలోవెరా జెల్‌తో కలిపి బాగా అప్లై చేసి మసాజ్ కూడా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి మంచిది కదా అని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!


ఎవరు వాడకూడదు?

వృద్ధాప్య చర్మంపై వద్దు..

ముఖ చర్మం మీద ముడతలు ఉన్నవారు విటమిన్-ఇ క్యాప్సూల్ ను ఉపయోగిస్తుంటే ముందుగా చర్మ సంరక్షణ నిపుణులను సంప్రదించకుండా వాడటం మంచిది కాదు. దీని కారణంగా చర్మ రంధ్రాలు లాక్ అవుతాయి. చర్మంపై సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. కాబట్టి దీన్ని నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు.

జిడ్డుగల చర్మంపై వద్దు..

విపరీతంగా చెమట పట్టినప్పుడు జిడ్డు చర్మం జిగటగా మారుతుంది. కాబట్టి దీన్ని ముఖానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో నూనె ఎక్కువగా ఉండటం వల్ల చర్మం తడిగా కనిపిస్తుంది. మొటిమలు, చర్మం ఎరుపుగా మారడం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 04:26 PM