Triphala: త్రిఫల చూర్ణం రోజూ వాడితే జరిగేదేంటి? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:56 AM
త్రిఫల చూర్ణం అంటే మూడు పండ్లతో చేసిన మిశ్రమం అని అర్థం. ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఉంటుంది. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి చాలా ప్రత్యేకత ఉంది.

త్రిఫల చూర్ణం అంటే మూడు పండ్లతో చేసిన మిశ్రమం అని అర్థం. ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఉంటుంది. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి చాలా ప్రత్యేకత ఉంది. త్రిగుణాలుగా పిలువబడే వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ గా ఉంచడంలో త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. ప్రతిరోజూ త్రిఫల చూర్ణం తీసుకుంటూ ఉంటే కలిగే అద్బుత ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఈ కింది విధంగా చెబుతోంది.
జుట్టు, కళ్లు, చర్మానికి..
జుట్టు, కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో త్రిఫల అద్భుతంగా సహాయపడుతుంది. త్రిఫలలో ఎక్కువ మొత్తంలో ఉసిరికాయ ఉంటుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే త్రిఫల జుట్టుకు, చర్మ కణాలను రిపేర్ చేయడంలోనూ సహాయపడుతుంది. త్రిఫల తీసుకోవడం వల్ల వెంట్రుకలు దృఢంగా మారడంతో పాటు చర్మం మెరిసిపోతుంది. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం, త్రిఫల కంటికి కూడా మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
యాంటీ ఆక్సిడెంట్లు..
త్రిఫల శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నివారణలో త్రిఫల ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది పరిశోధకులు చెబుతున్నారు. త్రిఫల తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
జీర్ణశక్తి..
త్రిఫల చూర్ణంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా అవసరం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రిఫల నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది.ప్రేగులలో పేరుకున్న విషాలు, వ్యర్థాలు బయటకు వెళతాయి. మలబద్దకం సమస్య కూడా నివారిస్తుంది. తద్వారా పైల్స్ వంటి సమస్యల బాధ ఉండదు.
పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.