Share News

Tightness In Chest: మీకు ఛాతీలో బిగుతుగా, భారంగా అనిపిస్తుంటుందా? ఇలా ఎందుకు అవుతుందంటే..!

ABN , Publish Date - Feb 26 , 2024 | 08:05 PM

తరచుగా కొందరు ఛాతీ బిగుసుకుపోయినట్టు, ఛాతీ భారంగా ఉన్నట్టు ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రి నిద్రించే సమయంలో ఇలా అవుతుందని చెబుతుంటారు.

Tightness In Chest: మీకు ఛాతీలో బిగుతుగా, భారంగా అనిపిస్తుంటుందా? ఇలా ఎందుకు అవుతుందంటే..!

రోజువారీ జీవితంలో పనులు సవ్యంగా సాగాలంటే ఆరోగ్యం బాగుండాలి. సాధారణంగా జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలకే ఢీలా పడుపోతుంటాము. అలాంటిది శ్వాస సంబంధ సమస్యలు, ఆయాసం వంటివి చాలా ఇబ్బంది పెడతాయి. తరచుగా కొందరు ఛాతీ బిగుసుకుపోయినట్టు, ఛాతీ భారంగా ఉన్నట్టు ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రి నిద్రించే సమయంలో ఇలా అవుతుందని చెబుతుంటారు. ఇలా ఛాతీ బిగుతుగా అవ్వడం వెనుక అసలు కారణాలు ఏంటి? ఇలా ఎందుకు అవుతుంది? దీని వెనుక ఉండే సమస్యలు ఏంటి తెలుసుకుంటే..

పెరికార్డిటిస్ సమస్య..

ఛాతీ నొప్పి, అసౌకర్యానికి పెరికార్డిటిస్ కూడా కారణం కావచ్చు. పెరికార్డిటిస్ అనేది గుండె సమస్య. ఇది ఛాతీలో నొప్పిని, భారాన్ని కలిగిస్తుంది. గుండె చుట్టూ ఉండే కణజాల పొరలను పెరికార్డియం అంటారు. పెరికార్డియమ్ ఇన్ఫెక్షన్ లేదా ఎర్రబడినప్పుడు పెరికార్డిటిస్ సంభవించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కు చికిత్స చేయకపోతే ఇది అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఇది కూడా చదవండి: పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివీ..!


కండరాల ఒత్తిడి..

ఛాతీ నొప్పి ఇంటర్‌కాస్టల్ కండరాల ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. పక్కటెముకలలో ఒత్తిడి ఈ సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఇంటర్‌కాస్టల్ కండరాలపై ఒత్తిడి వల్ల పక్కటెముకలపై ఒత్తిడి ఏర్పడి ఛాతీలో భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నొప్పి నివారణ మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్..

ఛాతీ బిగుతుతో సహా జీర్ణ రుగ్మతలు కూడా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) వల్ల సంభవించవచ్చు. ఇది జీర్ణ సంబంధ సమస్య. దీని కారణంగా ఛాతీ ఒత్తిడి, ఛాతీ నొప్పి కూడా వస్తుంది. కడుపులో ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహించినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఛాతీ నొప్పితో పాటు లాలాజలం ఎక్కువ రావడం, ఆహారాన్ని మింగేటప్పుడు నొప్పి లేదా గొంతు నొప్పి ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స చేయడం అవసరం.

మానసిక ఆరోగ్య సమస్యలు..

శారీరక సమస్యలతో పాటు ఛాతీ నొప్పి, ఛాతీ బిగుతుగా ఉండటం కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మతలకు కారణం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉంటే ఛాతీ భారంగా అనిపిస్తుంది. యాంగ్జయిటీ డిజార్డర్ అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. దీని వలన ఆత్రుతగా ఉండటం, ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. ఇది కండరాల ఒత్తిడి, చెమట, వణుకు, వేగవంతమైన హృదయ స్పందన, మైకము, వికారంతో పాటు ఛాతీ నొప్పి, బిగుతుకు కారణం అవుతుంది. మానసిక సమస్యలను సకాలంలో చికిత్స చేయడం ముఖ్యం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 08:05 PM