Hair growth Tea: ఈ మేజిక్ టీతో.. నెత్తిపై ఒత్తైన జుట్టు.. అవాంఛిత రోమాలు మటుమాయం!
ABN , Publish Date - Jun 17 , 2024 | 08:46 PM
నెత్తిపై ఒత్తైన జుట్టు పెరిగేలా చేసి అవాంచిత రోమాలు తొలగించే హెయిర్ గ్రోత్ టీ.. పీసీఓడీ బాధితులకు వరం లాంటిది.

ఇంటర్నె్ డెస్క్: గ్రీన్ టీ ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. కానీ గ్రీన్ టీతో చేసే హెయిర్ గ్రోత్ టీతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మహిళల్లో అవాంఛిత రోమాల సమస్య కూడా సులువుగా వదిలిపోతుందని నిపుణులు మరీ మరీ చెబుతున్నారు (Health). ముఖ్యంగా, పీసీఓడీతో బాధపడే మహిళల్లో తలపై జుట్టు ఊడిపోవడంతో పాటు పెదవులు, వీపు వంటి చోట్ల అవాంఛిత రోమాల బెడద కూడా మొదలవుతుంది. ఈ సమస్యకు హెయిర్ గ్రోత్ టీ చక్కని పరిష్కారని నిపుణులు చెబుతున్నారు.
Health: ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్.. మనసు అదుపు తప్పదు!
పీసీఓడీ బాధితుల్లో అవాంఛిత రోమాలకు ప్రధాన కారణంగా 5-ఆల్ఫా-రిడక్టేజ్ అనే ఎంజైమ్. ఇది టెస్టెస్టిరోన్ అనే హార్మోన్‌ను డై హైడ్రో టెస్టెస్టిరోన్ గా మార్చుతుంది (డీటీహెచ్). డీటీహెచ్ వల్ల నెత్తిపై జుట్టు ఊడిపోతే పెదాలు, ఇతర భాగాల్లో జుట్టు పెరిగేలా చేస్తుంది. గ్రీన్ టీ, మెంతులు, దాల్చిన చెక్కతో చేసే హెయిర్ గ్రోత్ టీతో ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా మటుమాయమైపోతాయి.
పీసీఓడి బాధితుల్లో చెక్కర స్థాయిలను నిలువరించేందుకు మెంతులు ఎంతో ఉపయోగం. దాల్చిన చెుక్క కూడా ఇన్సూలీన్ నియంత్రణకు కీలకం. గ్రీన్ టీలో ఉండే అనేక ఔషధ గుణాలు చివరకు పీసీఓడీ బాధితులకు మేలు చేకూర్చుతుంది.
హెయిర్ గ్రోత్ టీ చేసేది ఇలా..
ముందుగా మెంతులు రాత్రంతా నానబెట్టాలి. ఆ తరువాత ఓ గిన్నెలో నీళ్లు మరిగించాలి. ఇందులో నానబెట్టిన మెంతులు, దాల్చిన చెక్క వేసి నీరు సగానికి ఆవిరయ్యే వరకూ మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని ఓ కప్పులోకి తీసుకుని అందులో ఓ గ్రీన్ టీ బ్యాగు వేయాలి. ఆ తరువాత ఐదు నిమిషాల తరువాత తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ అలవాటును కొసాగిస్తే జుట్టు ఆరోగ్యం బాగా మెరుగవుతుంది.