Share News

Plant-Based Food: మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివి..!

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:16 PM

ఆరోగ్యకరమైన ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారానికి ప్రాధాన్యత ఉంది. ఇవి తీసుకుంటే జరిగేదిదే..

Plant-Based Food:  మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివి..!

ఆహారమే ఆరోగ్యం అని అన్నారు. తీసుకునే ఆహారం బట్టి మనిషికి ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఎప్పుడూ శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ప్రత్యేక లాభాలు కూడా చేకూర్చుతుంది. ఈ ఆరోగ్యకరమైన ఆహారాల లిస్ట్ లో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నది ప్లాంట్ బేస్ట్ ఫుడ్. మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? మొక్కల ఆధారిత ఆహారంలో ఏమేం ఉంటాయి? దీన్ని ఎందుకు తీసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..

మొక్కల ఆధారిత ఆహారం..

మొక్కల ఆధారిత ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల విత్తనాలు, , మొక్కల నుండి పొందన నూనెలు, తృణధాన్యాలు మొదలైనవి. వీటి వల్ల విటమిన్లు, పోషకాలు శరీరానికి సరిపడినంత సరఫరా అవుతాయి.

పోషకాలు..

మొక్కల ఆధారిత ఆహారంలో ఆరోగ్యానికి అవసరమైన అన్ని ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు పొందవచ్చు.

రక్తపోటు..

గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ప్రధానంగా ఉంటుంది. ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాన్ని చేర్చడం వల్ల ఈ సమస్యలన్నింటినీ నివారించడంలో సహాయపడుతుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు రక్తపోటును గణనీయంగా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు.

మధుమేహం..

ఆహారం టైప్-2 మధుమేహం మధ్య లోతైన సంబంధం ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్‌ను నివారించడమే కాకుండా మధుమేహం వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చని పరిశోధకులు స్వష్టం చేస్తున్నారు.

బరువు..

అధిక బరువు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. BMI నియంత్రణలో ఉంటే గుండె, మధుమేహం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Updated Date - Feb 26 , 2024 | 06:17 PM