Share News

Kidney Stones: కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే ఏం చేయాలి? ఈ 6 చిట్కాలు పాటించి చూడండి..!

ABN , Publish Date - May 17 , 2024 | 03:31 PM

కిడ్నీలు పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు, లవణాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లవు. అంతేనా ప్రతి రోజూ 170 లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు వడపోస్తాయి. ఈ కారణంగా మూత్ర పిండాలు శరీరంలో చాలా కీలకం అని అర్థం అవుతుంది. అయితే మూత్రపిండాలకు సంబంధించి చాలామందిలో ఎదురయ్యే సమస్యలలో రాళ్లు ఏర్పడటం ఒకటి.

Kidney Stones:  కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే ఏం చేయాలి? ఈ 6 చిట్కాలు పాటించి చూడండి..!

మనిషి శరీరంలో ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి అవయవాలలో కిడ్నీలు లేదా మూత్రపిండాలు చాలా ముఖ్యమైనవి. కిడ్నీలు పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు, లవణాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లవు. అంతేనా ప్రతి రోజూ 170 లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు వడపోస్తాయి. ఈ కారణంగా మూత్ర పిండాలు శరీరంలో చాలా కీలకం అని అర్థం అవుతుంది. అయితే మూత్రపిండాలకు సంబంధించి చాలామందిలో ఎదురయ్యే సమస్యలలో రాళ్లు ఏర్పడటం ఒకటి. చాలామంది మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మూత్రపిండాలలో రాళ్ల సమస్య రాకూడదంటే 6 చిట్కాలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు వైద్యులు. అవేంటో తెలుసుకుంటే..

ఇప్పట్లో మాంసాహారం చాలా విరివిగా తింటున్నారు. దీనివల్ల కిడ్నీలలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి మూత్రపిండాలలో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారం తీసుకునేలా జాగ్రత్త పడాలి.

అధిక రక్తపోటు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!


మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం ఉత్తమం. నీరు బాగా తాగడం వల్ల మూత్రంలో రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు అన్నీ కరిగిపోతాయి. అవి ఇంకా లవణాల రూపంలో ఉన్నట్టే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి ఊబకాయం కూడా ప్రధాన కారణం అని అంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుకైన జీవనశైలి ఉండటం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్యను అధిగమించవచ్చు.

ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఆహారం ద్వారా ఏ విధంగానూ సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

రోజ్మేరీ టీ తాగడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే..!


ఆక్సలేట్ లు మూత్రంలో ఉండే కాల్షియంతో కలిసి కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి. అందుకే ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. పాలకూర, నట్స్, చాక్లెట్లు వంటి ఆక్సలేట్ అధికంగా ఉన్న ఆహారాలను చాలా మితంగా తీసుకోవాలి.

కిడ్నీలలో రాళ్ల సమస్య వచ్చినా, అలాంటి అనుమానాలు ఉన్నా సొంత వైద్యం చేసుకోవడం, సోషల్ మీడియాలో ఉన్న రెమిడీలు పాటించడం వంటివి చేయకూడదు. విషయం మీద స్పష్టత లేకుండా ఎలాంటి స్వంత ప్రయోగాలు చేయకూడదు.

అధిక రక్తపోటు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!

రోజ్మేరీ టీ తాగడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 17 , 2024 | 03:31 PM