Share News

Iodised salt Vs Sea Salt: అయోడైజ్డ్ ఉప్పు మంచిదా? సముద్రపు ఉప్పు మంచిదా? ఏది వాడితే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలంటే..!

ABN , Publish Date - Jan 18 , 2024 | 02:30 PM

మన రోజువారీ ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉయోగించే పదార్థం. అయోడిన్ ఉప్పు, సముద్రపు ఉప్పు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? దేంతో ఎక్కువ లాభాలాంటే..

Iodised salt Vs Sea Salt:  అయోడైజ్డ్ ఉప్పు మంచిదా? సముద్రపు ఉప్పు మంచిదా? ఏది వాడితే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలంటే..!

మన రోజువారీ ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉయోగించే పదార్థం. ఇది ఆహారంలో రుచిని తీసుకురావడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్‌లో బోలెడు బ్రాండులు, వివిధ రకాల ఉప్పులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఉప్పు అనే రెండు రకాలు చాలా ఇళ్లలో రెగ్యులర్ గా వాడతారు. అయోడైజ్డ్ ఉప్పును అప్పటికప్పుడు కూరల్లో, ఇతర ఆహారాల్లో కలుపుకోవడానికి వాడితే.. సముద్రపు ఉప్పును వంట చేసేటప్పుడు కూరల్లో వేస్తుంటారు. ఈ రెండింటిలో ఏది మంచిది? దేనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ తెలుసుకుంటే..

అయోడైజ్డ్ ఉప్పు..

అయోడిన్ ను జోడించడం ద్వారా అయోడైజ్డ్ ఉప్పును తయారుచేస్తారు. ఇది సాధారణంగా టేబుల్ ఉప్పుగా, భోజనం చేసేటప్పుడు ఆహారంలో ఉప్పు తక్కువైనప్పుడు కలుపుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. పానీయాల్లో, కూరల్లో ఇట్టే సులువుగా కలిసిపోయి, కరిగిపోతుంది. అయోడిన్ అనేది శరీరానికి చాలా అవసరమైన ఖనిజం. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది. జీవక్రియ వేగంగా ఉండటం, జీవక్రియ మందగించడం వంటి రెండు పరిస్థితులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో అయోడిన్ లేకపోవడం వల్ల అయోడిన్ లోపం వస్తుంది. దీని వల్ల గాయిటర్, హైపోథైరాయిడిజం, మానసిక బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

ఇది కూడా చదవండి: మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!


సముద్రపు ఉప్పు..

సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా సముద్రపు ఉప్పు తయారుచేస్తారు. దీని తయారీకి ప్రాసెస్ తక్కువ. ఈ కారణంగా టేబుల్ సాల్ట్‌లో లేని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు దీంట్లో ఉంటాయి. సముద్రపు ఉప్పు కూడా చాలా రకాలుగా ఉంటుంది. వీటిని వివిధ వంట ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ఆరోగ్యానికి ఏది మేలంటే..

అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఉప్పు మధ్య ప్రధాన వ్యత్యాసం అయోడిన్ కంటెంట్. సముద్రపు ఉప్పులో అదనపు అయోడిన్ ఉండదు. రోజువారీ ఆహారంలో సముద్రపు ఉప్పు మాత్రమే తీసుకున్నట్లైతే అయోడిన్ లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది.

అయోడైజ్డ్ ఉప్పుతో పోలిస్తే సముద్రపు ఉప్పు అధిక మొత్తంలో ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు దీన్నే ఎక్కువ వాడతారు. రక్తపోటును నియంత్రించడం, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహించడం వంటి వివిధ శారీరక విధులకు సముద్రపు ఉప్పులో ఖనిజాలు సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: RO Water: ఆరోగ్యానికి మంచిది కదా అని ఫిల్టర్ వాటరే తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!



సముద్రపు ఉప్పు కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ దీని నుండి అయోడిన్ లభించదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆహారంలో కేవలం సముద్రపు ఉప్పును ఉపయోగించడం వల్ల అయోడిన్ లోపం సమస్యలు పెరుగుతాయి.

సముద్రపు ఉప్పులో ఖనిజాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా వీటిని సులభంగా పొందవచ్చు. కేవలం ఖనిజాల కోసం సముద్రపు ఉప్పు మీద ఆధారపడటం సరికాదు.

రెండు ఉప్పులూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ చాలామంది అయోడైజ్డ్ ఉప్పుకు ఓటు వేస్తారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఉప్పు రెండింటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Stomach Acids: గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారా? ఈ 8 ఆహారాలతో సమస్యకు చెక్ పెట్టచ్చు!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 02:30 PM