Share News

High Protein Snacks: ఈ స్నాక్స్ తినండి చాలు.. గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది..!

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:24 PM

ప్రోటీన్ కోసం చాలామంది వివిధ రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గుడ్లు, మాంసంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని కూడా చెబుతారు. అయితే గుడ్లు, మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఉంటాయి

High Protein Snacks: ఈ స్నాక్స్ తినండి చాలు.. గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది..!
snacks

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ కోసం చాలామంది వివిధ రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గుడ్లు, మాంసంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని కూడా చెబుతారు. అయితే గుడ్లు, మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పుకుండా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసినంత ప్రోటీన్ లభిస్తుంది. అవేంటో తెలుసుకుంటే..

రోస్టెడ్ చానా.. ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న ఆహారం. వేయించిన శనగలు తింటే బోలెడు ప్రోటీన్ లభిస్తుంది. శనగలు మొక్కల ఆధారిత ప్రోటీన్ కాబట్టి ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి 100గ్రాముల శనగలలో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శనగలను కేవలం వేయించి మాత్రమే కాదు.. ఉడికించి కూడా తీసుకోవచ్చు.

Also Read : Sleeping: ఎలా నిద్రపోతే ఆరోగ్యం? దిండు వేసుకునా లేక దిండు లేకుండానా? వైద్యులు తేల్చిన నిజాలివే..!



వేరుశనగ భారతీయుల ఆహారంలో ఎప్పటినుండో భాగంగా ఉంది. వేయించిన వేరుశనగలు లేదా ఉడికించిన వేరుశనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100గ్రాముల వేరుశనగలలో 25గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

పెసరపప్పు ప్రోటీన్ కు మంచి మూలం. వేయించిన పెసరపప్పుతో చాట్ తయారుచేసుకుని తినవచ్చు. లేదంటే పెసలు మొలకలు తెప్పించి వాటిని కూడా సలాడ్ లాగా చేసుకుని తినవచ్చు. 100గ్రాముల పెసరపప్పు చాట్ లో 17గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

పాలు పోషకానికి ప్రసిద్ధి చెందినవి. పాల నుండి తయారయ్యే పనీర్ కూడా ప్రోటీన్ పుష్కలంగా కలిగి ఉంటుది. 100 గ్రాముల పనీర్ లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Also Read: మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


ప్రోటీన్ కు గొప్ప మూలంగా సోయాను చెబుతారు. సోయా బీన్స్ మాత్రమే కాకుండ వీటితో తయారయ్యే సోయా చంక్స్ లో కూడా ప్రోటీన్ బాగుంటుంది. 100గ్రాముల సోయా చంక్స్ లో 51గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

బాదం పప్పులు ప్రోటీన్ కు గొప్ప మూలం. వీటిని నానబెట్టుకుని లేదా వేయించి కూడా తినవచ్చు. ఇతర స్నాక్స్ లో కూడా భాగం చేసుకోవచ్చు. 100గ్రాముల బాదంలో 31గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 24 , 2024 | 03:02 PM