Share News

Health Tips: నెయ్యి, మిరియాల పొడి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే జరిగేదిదే..!

ABN , Publish Date - May 23 , 2024 | 04:03 PM

నెయ్యి, మిరియాల పొడి కాంబినేషన్ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఒక చెంచా నెయ్యిలో చిటికెడు నల్ల మిరియాల పొడిని మిక్స్ చేసి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇలా తింటే ఏం జరుగుతుందంటే..

Health Tips: నెయ్యి, మిరియాల పొడి..  ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే జరిగేదిదే..!

నల్ల మిరియాలు, నెయ్యి భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉంటాయి. వివిధ రాకల వంటలమలో వీటిని వాడుతుంటారు. అయితే ఈ రెండింటిని కలిపి తినడం గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. నెయ్యి, మిరియాల పొడి కాంబినేషన్ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఒక చెంచా నెయ్యిలో చిటికెడు నల్ల మిరియాల పొడిని మిక్స్ చేసి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇలా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచే పైపెరిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. దీన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మరింత మెరుగుపడుతుంది. నెయ్యి జీర్ణవ్యవస్థను మృదువుగా చేస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!


నల్ల మిరియాలు, నెయ్యి రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మిశ్రమం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్, ఇతర వాపు సంబంధిత సమస్యలకు ఉపయోగపడుతుంది.

మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నెయ్యిలో ఉండే విటమిన్లు, మినరల్స్ కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ మిశ్రమం శరీరంలో అనేక అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

వింతగా అనిపించినప్పటికీ, మిరియాలు, నెయ్యి కలయిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. నెయ్యి శక్తి వనరుగా పనిచేస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

నల్ల మిరియాలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి చర్మం కాంతివంతంగా మారడానికి, చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. నెయ్యి చర్మానికి తేమను అందించి, జుట్టుకు పోషణనిచ్చి, జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.

ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!

నెయ్యిలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత పెరుగుతుంది.

భోజనం తరువాత ఓ చిన్న బెల్లం ముక్క తింటే ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 23 , 2024 | 04:08 PM