Share News

AC Sideeffects: నిరంతరం ఏసీ గదుల్లో గడిపే వారికి వచ్చే సమస్యలేంటో తెలుసా?

ABN , Publish Date - May 21 , 2024 | 09:09 PM

ఎక్కువ సేపు ఏసీల్లో గడిపితే పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటివి వస్తాయట. కాబట్టి, అప్పుడప్పుడూ బయటి వాతావరణంలో కొంత సేపు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

AC Sideeffects: నిరంతరం ఏసీ గదుల్లో గడిపే వారికి వచ్చే సమస్యలేంటో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: ఇది ఎండాకాలం.. వేడిని తట్టుకోలేక అనేక మంది ఏసీలు వినియోగిస్తున్నారు. ఏసీతో వచ్చే చల్లని వాతావరణంలో గంటలు గంటలు గడిపేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నామనుకుంటున్నారు. అయితే, ఇలా ఎక్కువ సేపు ఏసీల్లో గడిపితే పలు ఆరోగ్య (Health) సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు (Effects of Spending too much time in AC rooms ). అవేంటో ఓసారి చూద్దాం..

Raw Milk: వామ్మో.. పచ్చి పాలు తాగితే ఇంత ప్రమాదమా?


  • ఏసీ గదుల్లో తేమ తక్కువగా ఉంటుంది. దీంతో, చర్మం, కళ్లు పొడిబారి దురదగా, ఇబ్బంది కరంగా అనిపించొచ్చు. కళ్లు ఎర్రగా మారడం, మంటపుట్టడం వంటివి జరగొచ్చు

  • చల్లదనం కారణంగా కండరాలు, కీళ్లు బిగుసుకుపోయినట్టు అనిపిస్తాయి. ఉష్ణోగ్రత్తలో మార్పులకు త్వరగా అలవాటు పడలేని వారిలో ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.

  • ఏసీ గదుల్లో వ్యాధి కారక దుమ్మూ ధూళి కణాలు బయటకు వెళ్లక గదిలోపలే ఉండిపోతాయి. వీటి వల్ల అనేక రకాల ఊపిరితిత్తుల సమస్యలు రావొచ్చు

  • ఏసీ ఫిల్టర్లు సరిగా శుభ్రం చేయకపోవడం కూడా ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

  • ఏసీ గదుల కారణంగా తలనొప్పి, నీరసం వంటివి కూడా బాధిస్తాయి. చల్లదనం కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల మెదడుకు రక్తసరఫరాతగ్గి తలనొప్పి మొదలవుతుంది. చల్లదనం కారణంగా శరీరంలో సహజసిద్ధమైన ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడతాయి. దీంతో, ఎక్కువ సేపు ఏసీలో ఉంటే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

  • ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు ఏసీలో హ్యూమిడిటీ, ఉష్ణోగ్రతలను సరైన విధంగా సెట్ చేసుకోవాలి. గదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చి పోయేలా ఏర్పాట్లు చేయలి. ఏసీని క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ ఉంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవు. నిరంతరం ఏసీ గదిలోనే ఉండకుండా అప్పుడప్పుడూ బయటకు వచ్చి వెళుతుండాలి. నిత్యం కావాల్సినంత నీరు తాగాలి.

Read Health and Telugu News

Updated Date - May 21 , 2024 | 09:16 PM