Share News

Eating Banana: అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఎప్పుడు తింటే మేలు జరుగుతుందంటే..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:42 PM

తక్కువ ధరలో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల అందరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఇవి తినడానికి, జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉండటం వల్ల పిల్లల నుండి వృద్దుల వరకు అందరికీ ఇవి అనువుగా ఉంటాయి. అయితే అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు సమృద్దిగా లభించాలంటే అవి తినే సమయం ప్రధానం.

Eating Banana:  అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఎప్పుడు తింటే మేలు జరుగుతుందంటే..!

అరటిపండ్లు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ప్రధానమైవి. ఇవి తక్కువ ధరలో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల అందరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఇవి తినడానికి, జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉండటం వల్ల పిల్లల నుండి వృద్దుల వరకు అందరికీ ఇవి అనువుగా ఉంటాయి. అయితే అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు సమృద్దిగా లభించాలంటే అవి తినే సమయం ప్రధానం అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండ్లు ఏ సమయంలో తింటే లాభాలు ఎక్కువ ఉంటాయో తెలుసుకుంటే..

కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!


అరటిపండ్లను పగటిపూట ఎప్పుడైనా తినవచ్చు కానీ రాత్రిపూట మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి అరటిపండును రాత్రి సమయంలో తినకూడదు. అయితే ఉదయం లేదా సాయంత్రం అరటిపండ్లు తినవచ్చట. కానీ కొందరు మాత్రం అరటిపండ్లు రాత్రిపూట తింటే నిద్రను క్రమబద్ధీకరించి మంచి నిద్ర వచ్చేలా చేస్తుందని అంటారు. శ్లేష్మ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట అరటిపండ్లను తినకూడదట. ఎందుకంటే రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుంది.

అరటిపండ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. దీని కారణంగా అరటిపండ్లను ఖాళీ కడుపుతో తింటే అది కడుపు నొప్పి రావడానికి కారణం అవుతుంది. అందుకే అరటిపండును మరేదైనా ఇతర ఆహారాలతో కలిపి తినడం మంచిది.

Health Tips: ఈ 4 అలవాటు చేసుకోండి చాలు.. 45ఏళ్లలోనూ 25 ఏళ్లలా యవ్వనంగా కనిపిస్తారు..!



అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజాలు మెండుగా లభించాలంటే అరటిపండ్లను కొనుగోలు చేసేటప్పుడు, వాటిని తినేటప్పుడు బాగా పండినవే తినాలి. తాజాగా పండిన అరటిపండు తక్కువ తీపిగా ఉంటుంది. దానిలోని పిండి పదార్ధం చక్కెరగా మార్చబడదు. అదే పూర్తీగా పండిన అరటిపండు తియ్యగా ఉంటుంది, పిండి పదార్ధం సరిగ్గా విచ్ఛిన్నమవుతుంది. ఇది శక్తిని పెంచుతుంది. అరటిపండులో ఉండే అమైనో ఆమ్లాలు ఆందోళనను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.

Sodium: సోడియం లోపం గురించి విన్నారా? దీని లోపం ఉంటే ఏం జరుగుతుందంటే..!


Vitamin-A: విటమిన్-ఎ లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఓసారి చెక్ చేసుకోండి..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 06 , 2024 | 05:42 PM